భారత్లో ఉండి పాకిస్తాన్ పై జాలి చూపుతున్న కాంగ్రెస్ నేతలపై పవన్ విరుచుకుపడ్డారు. పహల్గాం మృతులకు నివాళి కార్యక్రమాన్ని జనసేన తరపున నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ కు సహనం ఎక్కువ. కానీ .. మితిమీరిన మంచితనం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ మూడుసార్లు యుద్ధంలో ఓడిపోయినా, మనమీద ఉగ్రదాడులు చేస్తూనే ఉందని.. ఈ సమయంలో దీనిపై ఓ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. రేపు యుద్ధం వచ్చినా, రాకపోయినా మనం దేశం అని ఆలోచించాలన్నారు.
26 మందిని మత ప్రాతిపదికన చంపినా.. మతాన్ని చూసి చంపలేదని సో కాల్డ్ సెక్యూలర్ వాదులు వాదిస్తున్న అంశంపై పవన్ తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్ మీద అంత ప్రేమ ఉంటే ఆ దేశానికే వెళ్లిపోవాలని అలాంటి వారికి సలహా ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్ పై జాలి చూపుతున్నారు. దేశంపై దాడి జరిగితే పాక్ కు మద్దతు తెలుపుతూ సెక్యూలరిజం అంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. మత ప్రాతిపదికన చంపితే సెక్యూలర్ అని వాదించే వారిని ఏమనాలని ప్రశ్నించారు.
అన్నయ్య సినిమాల షూటింగ్ కోసం ఎన్నోసార్లు కాశ్మీర్ వెళ్లామని కాశ్మీర్ పండిట్ల వలసను ఆనాడు ఆపి ఉంటే వారు అక్కడే ఉండేవారని గుర్తు చేసారు. ఎంతో నమ్మకం ఉంటేగానీ కాశ్మీర్ కు ప్రజలు వెళ్లరు. అయితే ఆర్టికల్ 370 రద్దుతో పరిస్థితి మారిందని పర్యాటకులు వెళ్తున్నారు. కానీ తీవ్రవాదులు అలజడి సృష్టించారు. చనిపోయిన వారి కుటుంబాలను బాధ చూశాక ఉగ్రవాదులను చంపేయాలి అనిపిస్తోందన్నారు. ఉగ్రవాద దాడిలో చనిపోయిన మధుసూదన్ కుటుంబానికి పవన్ యాభై లక్షల సాయం ప్రకటించారు.