పవన్ కల్యాణ్ సినిమా ఫంక్షన్ అంటే, పవన్ ఏం మాట్లాడతాడా? అనేదానికంటే… బండ్ల గణేష్ ఏం చేస్తాడు? ఎట్టా నవ్విస్తాడు? అనేదానిపైనే పవన్ అభిమానుల ఫోకస్ ఉంటుంది. ప్రతీసారి ఫంక్షన్లో బండ్ల స్పీచే హైలెట్ అవుతూ ఉంటుంది. ఆడిటోరియంలో, సోషల్ మీడియాలో బండ్ల స్పీచ్‌కి వచ్చే రెస్పాన్సే వేరుగా ఉంటుంది.
ఈరోజు `భీమ్లా నాయక్` ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగబోతోంది. హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఫంక్షన్‌కి కేటీఆర్ ముఖ్య అతిథిగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈఫంక్షన్ కి బండ్ల వస్తాడా, వస్తే ఏం మాట్లాడతాడు? అనే ఆసక్తినెలకొంది అందరిలో. బండ్ల స్పీచు రెడీ చేసుకుంటున్నట్టు, అది చూసి త్రివిక్రమ్ కౌంటర్లు వేస్తున్నట్టు (అపరిచితుడు లవ్ లెటర్ సీన్ కి స్పూఫ్) కొన్ని మీమ్స్ కూడా వచ్చేశాయి.
అయితే ఈ ఫంక్షన్‌కి బండ్ల రావడం లేదని మరో టాక్. భీమ్లా వేడుకకు రావాలని బండ్లకు ఆహ్వానం అందలేదట. `స్పీచ్ రెడీ చేసేశా. కానీ త్రివిక్రమ్ రావద్దన్నాడు… అందుకే నేను రావడం లేదు` అంటూ బండ్ల గణేష్ అభిమానులతో ఫోన్లో మాట్లాడుతున్నట్టు ఓ వాయిస్ రికార్డ్ బయటకు వచ్చింది. అది ఫేకా? రియలా? అనేది పక్కన పెడితే, బండ్ల మాత్రం ఈ ఫంక్షన్‌కి రావాలని పవన్ ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. వస్తే మాత్రం – స్పీచు దంచి కొట్టి వదలడం ఖాయం.