ప్రబుత్వంపై బురదజల్లే ప్రయత్నంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నవ్వుల పాలవుతున్నారు. పవన్ కల్యాణ్‌కు … ఇప్పుడు ప్రభుత్వం అన్నా.. చంద్రబాబు అన్నా.. అవినీతి అనేది ఒక్కటే గుర్తుకు వస్తోంది. ఇసుక లారీ కనిపిస్తే.. అది చంద్రబాబు అవినీతికి సాక్ష్యం అంటున్నారు. ఏం జరిగినా.. సరే అవినీతి.. అవినీతి అని నిర్మోహమాటంగా… ప్రభుత్వంపై బురదజల్లేస్తున్నారు. అయితే ఆయన ఆరోపణల్లో లాజిక్‌లు ఉండవని… ఫ్యాన్ కూడా అనుకుంటూంటారు. టీడీపీ నేతలు .. కూడా అదే చెబుతారు. అప్పుడప్పుడు పవన్ కల్యాణ్… తమ మాటలతో.. తాను చెప్పేవన్నీ.. ఉత్తుత్తి కబుర్లేనని బయటపెట్టేస్తూంటారు. తాజాగా తన పోరాటయాత్రలో ఫ్యాన్స్‌ను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఇలా బయటపడిపోయారు. ” ఫ్రాంక్లిన్ టెంపుల్టన్” అనే వ్యక్తికి లోకేష్ భూములు కట్టబెట్టాడని.. ఆ భూముల్ని ఆయన అమ్ముకున్నాడని.. చెప్పేశారు. అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
“ఫ్రాంక్లిన్ టెంపుల్టన్” అనే పేరు ఓ మాదిరిగా చదువుకున్న వాళ్లకి బాగా పరిచయమే. ముఖ్యంగా… ఇంజినీరింగ్, డిగ్రీలు పూర్తి చేసిన యువతకు.. ఇది ఇంగా బాగా తెలుసు. అమెరికన్ మల్టినేషనల్ కంపెనీ అయిన ” ఫ్రాంక్లిన్ టెంపుల్టన్”కు హైదరాబాద్ గచ్చిబౌలిలో చాలా పెద్ద క్యాంపస్ ఉంది. దానిలో ఓ పది వేల మంది వరకూ పని చేస్తారు. ఈ సంస్థ క్యాంపస్‌ను.. విశాఖలో పెట్టగలిగేలా ఒప్పించింది.. ఏపీ ప్రభుత్వం. మంత్రి లోకేష్.. ప్రత్యేకంగా ఐటీ పాలసీ ప్రకటించి.. రాయితీలిచ్చి.. ఈ కంపెనీని ఎలాగోలా వైజాగ్ వరకూ తీసుకురాగలిగారు. హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి.. మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ఎలా ప్లస్ అయిందో… విశాఖలోనూ.. ” ప్రాంక్లిన్ టెంపుల్టన్” అలా అవుతుందని… మంత్రి లోకేష్… ఆశాభావంతో ఉన్నారు.
ఇలాంటి కంపెనీని… ఓ వ్యక్తిగా పరిగణించి పవన్ కల్యాణ్ అభాసుపాలయ్యాడు. పైగా.. ఇచ్చిన భూముల్ని అమ్మేసుకున్నారని కూడా చెప్పుకొచ్చారు. ఐటీ కంపెనీలకు కేటాయించే భూముల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు పెట్టుకుంటుంది. అత్యధిక సందర్భాల్లో తక్కువ మొత్తానికి లీజుకిస్తారు. ఒక వేళ భూములు రాయితీ ధరకు ఇచ్చేసినా.. అమ్ముకోవడానికి.. బ్యాంకుల్లో పెట్టుకోవడానికి చాన్సివ్వరు. పూర్తి స్థాయిలో కంపెనీని ఏర్పాటు చేసి.. హామీల ప్రకారం ఉద్యోగాలు కల్పించిన తర్వాతే.. ఆ భూములపై పూర్తి హక్కులు వచ్చేలా.. నిబంధనలుంటాయి. ఇవన్నీ పవన్ కల్యాణ్ తెలుసుకోకుండానే… విశాఖలో ” ఫ్రాంక్లిన్ర టెంపుల్టన్” కి భూములిచ్చారు కాబట్టి.. అవినీతి జరిగిపోయిందన్న ఉద్దేశంతో ఆరోపణలు చేసేశారు. తాను చెప్పే వాటికి బేస్ ఉండదని.. తానే బయటపెట్టుకున్నారు.