పవన్ కళ్యాణ్ మరో రీమేక్ కి సిద్దమౌతున్నారు. తమిళంలో సముద్రఖని దర్శకత్వం వహించి, నటించిన వినోదయ సిత్తం సినిమాని పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తున్నారు. దీనికి సముద్రఖని దర్శకుడు. ఐతే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ పక్కా డెడ్ లైన్ ఇచ్చారు. కేవలం నలఫై రోజులు మాత్రమే ఈ సినిమా కోసం కేటాయించారు. పవన్ కళ్యాణ్ కాల్షీట్లు తగ్గట్టు టీం పక్కాగా షూటింగ్ ని ప్లాన్ చేస్తుంది. నలఫై రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని హరీష్ శంకర్ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళతారు. ప్రస్తుతం ఈ రీమేక్ స్క్రిప్ట్ పనులు జోరుగా జరుగుతున్నాయి. సాయి మాధవ్ బుర్రా డైలాగులు రాస్తున్నారు. ఒరిజినల్ తో పోలిస్తే రీమేక్ లో చాలా మార్పులు కనిపిస్తాయి. ఒరిజినల్ వెర్షన్ లో యాక్షన్ కి పెద్ద స్కోప్ లేదు. ఐతే పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ కలసి చేస్తున్న ఈ రీమేక్ లో యాక్షన్ పార్ట్ ని పెంచబోతున్నారు. ఒరిజినల్ ఐడియా ని తీసుకొని పూర్తి కమర్షియల్ హంగులతో ఈ రీమేక్ ని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు.