సోమవారం తాడేపల్లి సమీపంలోని ఇప్పటం గ్రామంలో నిర్వహించనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను పవన్ కల్యాణ్ చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఇప్పటం సభ రెగ్యులర్‌గా నిర్వహించే సభల్లాంటిది కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్‌ను నిర్దేశించే సభగా పేర్కొన్నారు. భవిష్యత్ ఆంధ్రపరదేశ్ రాజకీయాలను దిశానిర్దేశం చేస్తున్నట్లుగా ప్రకటించారు. గత రెండున్నరేళ్లలో ఏం జరిగింది .. భవిష్యత్ ఎలా ఉండబోతోందో ప్రసంగిస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు.
జనసేన తొమ్మిదో ఏట అడుగుతున్నందున అందరూ రావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. వీర మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. సభకు వచ్చినా దూరంగా ఉండిపోయేవారికి ప్రత్యేకంగా ఎల్ఈడీ తెరలు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రకటించారు. సభా ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య చైతన్య వేదిక అనే పేరు పెట్టారు. ఇప్పటికే జనసేన కమిటీలు అక్కడ విస్తృతంగా పనులు చేస్తున్నాయి. సభా వేదిక పనులు దాదాపుగా పూర్తయ్యాయి.
అది అన్నింటి లాంటి సభ కాదని.. ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ చెప్పడంతో ఆయన ప్రసంగం ధాటిగా.. వాడిగా వేడిగా ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వం తీరుపై తీవ్ర అసహనంతో ఉన్న జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున సభా ప్రాంగణానికి తరలి వచ్చే అవకాశం ఉంది. టీడీపీ హయాంలో ఆయన నాలుగేళ్లు పూర్తయిన తర్వాత ఎన్నికల ఏడాదిలో ఆవిర్భావ దినోత్సవం పెట్టి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ సారి ముందస్తు ఎన్నికల ప్రచారం కారణంగా ఓ ఏడాది ముందే కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లుగా కనిపిస్ోతంది.