తాజా పర్యటనలో ప్రజారాజ్యం ప్రస్తావన ద్వారా పవన్ కళ్యాణ్ సామాజిక పునాదిని కాపాడుకునే ప్రయత్నం చేశారని ఆయన సన్నిహితులు అంగీకరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి ద్రోహం చేసిన వారెవరనీ తాను మర్చిపోలేదనీ వారిని దెబ్బ తీస్తానని చెప్పడంలోనూ అదే సంకేతం. ఇతరుల ద్రోహం అలా వుంచితే మెగాస్టార్ స్వయంగా తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడాని ఏమనాలి? మరి ఆయనకు తాను కూడా దూరం కావడంఎందుకు జరిగింది? తాము తీసుకురాదల్చుకున్న మార్పునకు ఎవరో అడ్డు పడ్డారని ఆరోపించే ముందు ఈ ప్రశ్నలు వేసుకోకపోవడం ఆశ్యర్యమే. ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ వైఖరి చిరంజీవి కంటే ఆయన భిన్నమనీ గట్టిగా వుంటారని చెబుతున్నవారు ఈ ప్రసంగం తర్వాత ఇరకాటంలో పడిపోయారు. మరోవైపు ఉన్న పార్టీలలోనే ఎంపిక చేసుకోవాలని, కార్యకర్తలు అవసరమైతే సీట్టకు పోటీ చేయకపోయినా అర్థం చేసుకోవాలని సూచించడంలో పొత్తుల సూచన వుంది. సిఎం కావాలని లేదని కూడా చెప్పేశారు. అంటే ఆయన ఇతరులను బలపర్చబోతున్నారని అయితే అది జగన్ మాత్రం కాదని అర్థం చేసుకోవచ్చు. జగన్‌ది వారసత్వమని నేరుగా విమర్శించి సరదాగా లోకేశ్‌ను ప్రస్తావించిన పవన్ మొదట్లో తను కూడా వారసుడుగానే వచ్చాననీ ఇప్పుడు కూడా అన్నయ్య పేరు తీసుకొచ్చి దాన్ని చాటుకున్నానని ఒప్పుకోవలసి వుంటుంది.ఇక ఇటు పవన్ జనసేన అటు వైసీపీ పోటాపోటీగా పోలవరం సందర్శనకు వెళ్తున్నారు. అక్కడి పరిస్థితిపై చేసే వ్యాఖ్యలను బట్టి ఆయన ్ ఎలా వ్యవహరించేది మరికొంచెం తెలియొచ్చు.అయితే ఆయన అన్ని అప్పుడే స్పష్టంగా చెప్పదల్చుకోలేదన్నది స్పష్టం. కాకుంటే చంద్రబాబు చేయిస్తాడని నాకు తెలియదా వంటి వ్యాఖ్యలతో తనకు పరిపక్వత వుందని చెప్పడానికి ప్రయత్నించారు. ఆఖరుకు చూస్తే మాత్రం అస్పష్టతే మిగిలింది.