మంత్రులు.. ఆ పై స్థాయిలో ఎవరైనా అన్యాయాలు , అరాచకాలు చేస్తే కొంత భరించవచ్చేమో కానీ కింది స్థాయి వరకూ నేతలు అరాచకాలకు పాల్పడితే తిరుగుబాటు తప్పదని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. వైసీపీలో ప్రస్తుతం అందరూ వైసీపీ అధనేత తరహాలోనే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దౌర్జన్యాలు, కబ్జాలతో చెలరేగిపోతున్నారని విమర్శించారు. వరుసగా రెండో వారం విజయవాడ మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో జనవాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వద్దకు పలువురు ప్రభుత్వ బాధితులు వచ్చారు. ఓ గ్రామంలో వైసీపీ ఎంపీటీసీ ఒకరు ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని కబ్జా చేయడంపై బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపైనే పవన్ మండి పడ్డారు.
ఒక ప్రభుత్వం స్థలం కేటాయించి ఇల్లు మంజూరు చేస్తే మరో ప్రభుత్వం రుణం మంజూరు చేసింది. కానీ ఇప్పుడు వైసీపీ నేతలు మాత్రం ఆ భూమిని లాక్కోవాడానికి ప్రయత్నిస్తున్నారు 20 ఏళ్లుగా ఉంటున్న ఇంట్లో నుంచి బాధితులను వెళ్లగొట్టారు. వైసీపీ పై స్థాయి నాయకులు.. కింది స్థాయి నేతలు కూడా అదే చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. ఎక్కువగా జనవాణిలో వైసీపీ నేతల దౌర్జన్యాలు, కబ్జాలపైనే తనకు ఫిర్యాదులు వ్సతున్నాయన్నారు. అందుకే వైసీపీ నేతలంటే తనకు చిరాకని స్పష్టం చేశారు.
విశాఖలో కనిపించిన కొండనల్లా మింగేస్తున్నారు. ఈ అన్యాయాలు ఇప్పుడు అడ్డుకోకపోతే ఇవి కొనసాగుతూనే ఉంటాయన్నారు. . దౌర్జన్యాలు పెరిగితే ఏదో ఒకరోజు ప్రజలే తిరగబడతారు. ప్రజలు మిమ్మల్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తారని హెచ్చరించారు. జనవాణిలో తాము తీసుకుంటున్న ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తున్నట్లు పవన్ చెప్పారు. రెండోవారం కూడా పవన్‌కు సమస్యలు చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు.