పవన్ కల్యాణ్ అభిమానులు ఎదురుచూపులు, నిరీక్షణ తెర దించుతూ… ‘అజ్ఞాత వాసి’ టీజర్ వచ్చేసింది. పవన్ స్టైలీష్ లుక్, హారిక హాసిన గ్రాండియర్, త్రివిక్రమ్ విజువల్స్… మొత్తానికి పవన్ 25వ సినిమా.. చాలా రిచ్‌గా.. ఉంది. ‘మధురా పురి సదన.. మృదు వదన’ అనే కీర్తన తో… ‘అజ్ఞాత వాసి’ టీజర్ మొదలైంది. ‘అత్తారింటికి దారేది’లో ‘దేవదేవం’ అనే కీర్తనని, అక్కడ కనిపించే విజువల్స్నీ చూసినట్టే ఉంది ‘అజ్ఞాత వాసి’ ని చూస్తుంటే. పవన్ డ్రస్సింగ్ స్టైల్ సూపర్బ్ అనేలా ఉంది గానీ, మేనరిజమ్స్ సేమ్ టూ సేమ్ ‘అత్తారింటికి దారేది’ని గుర్తు చేస్తున్నాయి. గాల్లో విమానం… దాని కింద పవన్… ఎగురుతున్న రౌడీలు.. ఆ షాట్ ఓ హ్ అనిపించేలా ఉంది. ఇలాంటి మెరుపులు ఇంకా ఉండి ఉంటే బాగుణ్ణు. పవన్ సిగ్గు పడుతున్న పోజు, చివర్లో మెటికలు విరుచుకుంటున్న దృశ్యం.. పవన్ అభిమానులకు నచ్చేవే.
కాకపోతే…. టీజర్లో త్రివిక్రమ్, పవన్‌ల కాంబో నుంచి ఆశించే మెరుపులు కరువయ్యాయి. ‘అతని చర్యలు ఊహాతీతం వర్మా..’ అనే డైలాగ్ ఒక్కటే ఇందులో వినిపించింది. పవన్ ‘ఓ మై గాడ్’ అంటూ ఆశ్చర్యపోవడం మినహాయిస్తే.. అతని నోటి నుంచి పలుకులేం వినిపించలేదు. అత్తారింటికి దారేది రిఫరెన్స్‌లు చెప్పుకోవడానికి చాలా కనిపిస్తున్నాయి ఈ టీజర్లో. ‘అజ్ఞాతవాసి’ టైటిల్ కాస్త ‘అత్తారింటికి దారేది 2’గా మారిస్తే.. జస్టిఫికేషన్ జరిగిపోయేదేమో. టీజర్ బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా ఇంకొంచం పవన్ మార్క్ పంచ్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఓవరాల్ గా అభిమానులకి ఆనందదాయకంగా , ఇతరులకి అత్తారింటికి దారేది హిట్ ఫార్ములాని గుర్తు చేస్తూ తొలి పరీక్షలో అజ్ఞాత వాసి సక్సెస్ అయ్యాడు