జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో సంచలనానికి తెర తీయబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పదకొండు రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేసి తిరుమలలో విరమించిన ఆయన శ్రీవారి పాదాల చెంత వారాహి డిక్లరేషన్ ఉంచి పూజలు చేశారు. దర్శనం తర్వాత బయటకు వచ్చిపనప్పుడు దాన్ని మీడియాకు చూపించారు. వారాహి డిక్లరేషన్ అని పుస్తకంపై ఉండటంతో ఒక్క సారిగా కలకలం బయలుదేరింది. అందులో ఏముందో జనసేన వర్గాలకు కూడా తెలియదు.
బధవారం పవన్ కల్యాణ్ తిరపుతి ఎస్వీ మ్యూజిక్ కాలేజీ గ్రౌండ్ లో బహింగసభ ఏర్పాటు చేశారు. ఈ సభలో వారాహి డిక్లరేషన్ ను ప్రకటించే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా రాజకీయాల్లో సంచలనం అవుతుందని అంటున్నారు. పవన్ కల్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణలో మరో మరో అడుగు ముందుకు వేయబోతున్నట్లుగా చెబుతున్నారు. దక్షిణాదిని సనాతన ధర్మ పరిరక్షకుడిగా.. హిందూత్వ బ్రాండ్‌తో పవన్ కల్యాణ్ తనదైన ముద్ర వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని అంటున్నారు.
తమిళ టీవీ చానల్ తంతి టీవీకి పవన్ కల్యాణ్ ఓ ఇంటర్యూ ఇచ్చారు. తమిళంలో అనర్గళంగా మాట్లాడిన పవన్ కల్యాణ్ హిందూత్వం, సనాతన ధర్మంపై తన వాదన బలంగా వినిపించారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే వారాహి డిక్లరేషన్ పూర్తిగా హిందూత్వ అంశంపై ఉండబోతోందని.. బుధవారం పవన్ ప్రకటించబోయే డిక్లరేషన్ లోని అంశాలు సంచలనం రేపుతాయని అంచనా వేస్తున్నారు.