జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ షెడ్యూల్ మారింది. ఆయన శనివారం రాత్రి హైదరాబాద్ వచ్చారు. ఆదివారం అల్లు అర్జున్ ను పరామర్శిస్తారని అనుకున్నారు. అయితే ఆయన షెడ్యూల్ మారిపోయింది. మళ్లీ ఉదయమే విజయవాడకు వెళ్లిపోయారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పవన్ కల్యాణ్ షెడ్యూల్ మారడంతో అర్జున్ ను పరామర్శించే ప్రోగ్రాం క్యాన్సిల్ అయినట్లుగా కనిపిస్తోంది.
మాములుగా అయితే వీకెండ్ కుటుంబానికి కేటాయించేందుకు పవన్ కల్యాణ్ ప్రాధాన్యత ఇస్తారు. అత్యవసర పనులు ఉంటేనే ఇలా విజయవాడలో ఉంటారు. ఈ రోజు పలు అత్యవసర పనులు ఉండటంతో రాత్రి వచ్చి ఉదయమే విజయవాడ వెళ్లిపోయారు. మరో వైపు పవన్ రాక క్యాన్సిల్ కావడంతో అల్లు అర్జున్ .. తమ కుటుంబ పెద్ద మెగాస్టార్ చిరంజీవిని కలిసేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసినప్పుడు షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ చిరంజీవి .. అర్జున్ ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయనను కలిసి అసలేం జరిగిందో అర్జున్ వివరించే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో అల్లు, కొణిదెల కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగిందని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ కలయిక కూడా హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది.