భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత పవన్ కల్యాణ్‌కు.. ఆ పార్టీ మీద ఈగ వాలినా నచ్చడం లేదు. జనసేన పార్టీ కోసం.. ఆయన చేసే ట్వీట్లు పరిమితంగానే ఉంటాయి కానీ.. అనూహ్యంగా ఇప్పుడు.. భారతీయ జనతా పార్టీపై వచ్చే విమర్శలను తిప్పికొట్టడానికి కూడా.. ట్వీట్లు ప్రారంభించారు. అమరావతిని కేంద్రానికి చెప్పే తరలిస్తున్నామని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటోంది. వైసీపీ అలా చేసుకుంటోందని.. బీజేపీ స్పందించాలని.. టీడీపీ డిమాండ్ చేస్తోంది. దీనిపై.. ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ ధియోధర్ స్పందించారు. అదంతా అబద్దమని.. రెండు పార్టీలు కలిసి.. బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని ట్వీట్ చేశారు. వెంటనే.. పవన్ కల్యాణ్ కూడా.. సునీల్ ధియోధర్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. తాను కూడా.. టీడీపీ, వైసీపీపై విమర్శలు చేశారు. అబద్దపు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పుకొచ్చారు.
నిజానికి ఆ రాజకీయ ప్రచారంలో.. జనసేన ప్రస్తావన లేదు. కానీ బీజేపీ కోసం జనసేన ముందడుగు వేసింది. అలాంటి ప్రచారంలో వాస్తవం లేదని.. ఖండిస్తూ.. నేరుగా పవన్ కల్యాణే రంగంలోకి దిగిపోయారు. నిజానికి బీజేపీ కనుసన్నల్లోనే.. వారి అనుమతితోనే.. అమరావతి తరలింపు జరుగుతోందని జాతీయ మీడియాలో ఓ వర్గం కొన్నాళ్లుగా చెబుతోంది. బీజేపీకి అనుకూలంగా ఉండే జాతీయ… మీడియా అసలు అమరావతి తరలింపు వార్తలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. గతంలో.. జగన్ నిర్ణయాలను.. తీవ్రంగా తప్పు పట్టి.. పట్టణీకరణలో.. ఓ గొప్ప అవకాశాన్ని జగన్ చిదిమేస్తున్నారని… అభిప్రాయం వ్యక్తం చేసిన .. మీడియా కూడా.. ఇప్పుడు సైలెంటయిపోయింది. వీటన్నింటి కారణంగానే.. బీజేపీ అనుమతితో జగన్ రాజధాని తరలిస్తున్నారన్న నమ్మకం ప్రజల్లో బలపడుతోంది.
ఈ విషయంలో పవన్ కల్యాణ్‌కు తెలిసి ఉండేది కొంతే. జగన్మోహన్ రెడ్డి .. ఏం చేసినా.. కేంద్రానికి చెప్పే చేస్తున్నారని.. విజయసాయిరెడ్డి చాలా రోజుల నుంచి చెబుతున్నారు. దీనిపై.. కేంద్రం నుంచి ఎలాంటి ఖండనలు రాలేదు. జగన్ నిర్ణయాల వల్ల అంతర్జాతీయంగా భారత్‌కు చెడ్డపేరు.. పెట్టుబడుల రాకపై సందిగ్ధత ఏర్పడినా కేంద్రం.. జగన్ నిర్ణయాలను తప్పు పట్టడం లేదు. ఇప్పుడు.. అమరావతి విషయంలోనూ.. అదే జరుగిందని.. నమ్మడానికి ఇవే కారణాలు. బీజేపీ .. రాష్ట్ర నిర్ణయంతో తమకు పని లేదని చెబుతోంది. నిజానికి విభజన చట్టం ప్రకారం.. రాజధానిపై కేంద్రానికి సంపూర్ణ హక్కులు ఉన్నాయి. అది చాలా చిన్న పిల్లవాడికి కూడా తెలుసు. కానీ.. బీజేపీ తమకు సంబంధం లేదనే వాదన వినిపించడానికే సిద్ధమయింది. అంటే.. అనుమతి ఉన్నట్లేనని నమ్ముతున్నారు. పవన్ కల్యాణ్‌కు తెర వెనుక ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆయన మాత్రం బీజేపీ తరపున బ్యాటింగ్ చేయడానికి రంగంలోకి దిగిపోయారు. రాజకీయంగా మరో సారి కార్నర్ అయ్యే పరిస్థితిని తెచ్చుకున్నారు.