గబ్బర్ సింగ్ కాంబినేషన్ మరోసారి సెట్ అయ్యింది. పవన్ కల్యాణ్ తో హరీష్ శంకర్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి `భవదీయుడు భగత్ సింగ్` అనే పేరు ఖరారు చేశారు. అయితే కథానాయిక ఎవరో ఇంత వరకూ తెలీలేదు. ఆ ఛాన్స్ పూజా హెగ్డేకి దక్కడం దాదాపుగా ఖాయమైపోయింది.
హరీష్ కి పూజ హెగ్డే సెంటిమెంట్ గా మారిపోయింది. డీజే, గద్దలకొండ గణేష్ చిత్రాల్లో తనే కథానాయిక. ఇప్పుడు పవన్ సినిమాకీ తననే తీసుకోవాలని గట్టిగా ఫిక్సయ్యాడు. దాదాపు తనే ఖాయం కూడా. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` ప్రీ రీలీజ్ ఫంక్షన్ లో పూజా ని ఎంచుకున్న విషయంలో నోరు జారేశాడు హరీష్. `పూజా బాగా బిజీ అయిపోయింది. పెద్ద హీరోలందరితోనూ సినిమాలు చేస్తోంది. మహేష్ బాబు, ప్రభాస్.. పవన్ కల్యాణ్..“ అంటూ పవన్‌ని తీసుకొచ్చేశాడు. అంటే.. భవదీయుడులో పవన్‌కి జోడీ దొరికేసిందని చెప్పేయడమే. కాకపోతే…ఈ కాంబోకి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సివుందంతే. త్వరలోనే `హరి హర వీరమల్లు` షూటింగ్ మొదలవుతుంది. ఆ తరవాత… హరీష్ సినిమానే పట్టాలెక్కిస్తాడు పవన్.