తెలంగాణలో బీజేపీతో పొత్తు ఉంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇప్పటికైతే బీజేపీతో పొత్తు కొనసాగుతుందన్న ఆయన… కొన్ని అంశాల్లో బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయాలు తీసుకుంటందన్నారు. తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ పాత్ర ఏంటనేది కాలమే చెప్పాలన్నారు పవన్ కల్యాణ్. ఎన్నికల నోటిఫికేషన్ పడినాటికి పొత్తులపై క్లారిటీ వస్తుందన్నారు జనసేన అధినతే పవన్ కల్యాణ్. పార్టీ ప్రచార రథం వారాహి వెహికల్కు ప్రత్యేక పూజలు చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు
తమ పరిమితి ప్రజలు నిర్ణయించాలన్నారు. తమ శక్తి మేరకు తెలంగాణలో గొంతును వినిపిస్తామన్నారు. తెలంగాణలో కొత్త వారు కలిసి వస్తే కొత్తగా ఎన్నికల్లోకి వెళ్తామన్నారు. ఎవరూ రాకుంటే ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొంటామని కామెంట్ చేశారు. బీఆర్ఎస్ ఏర్పాటును స్వాగతించిన పవన్ కల్యాణ్… మార్పు ఆహ్వానించదగిందే అన్నారు. తమ పార్టీ నేతలు బీఆర్ఎస్లోకి వెళ్లడాన్ని కూడా పవన్ లైట్ తీసుకున్నారు. కొందరు నాయకులు మార్పు కోరుకుంటారని అలాంటి వాళ్లు పార్టీ మారడం సహజమని కామెంట్ చేశారు.
తెలంగాణలో తమకు ఎవరితోనూ పొత్తు లేదని ఇంతకు ముందే బీజేపీ ప్రకటించింది. పవన్ కూడా గౌరవం దక్కని చోట కలసి ఉండటం సాధ్యం కాదని ప్రకటించారు. కానీ ఇప్పుడు వ్యూహాత్మకంగానే బీజేపీతో కలిసి ఉంటామని చెప్పారు. ఏపీలో పొత్తుల వ్యవహారం తేలడంలేదు. అందుకే తెలంగాణ విషయాన్ని కలిపి పవన్ వ్యూహాత్మకంగా మాట్లాడారని అంటున్నారు.