ఈరోజు చిరంజీవి బర్త్డే. ఈ సందర్భంగా జనసేనాని హోదాలో తమ్ముడు పవన్ కల్యాణ్ తన ప్రియమైన అన్నయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఇందులో వింతా, విడ్డూరం ఏమీ లేదు. కాకపోతే… ఈ శుభాకాంక్షల్లోనూ జగన్ ని దెప్పిపొడిచేశాడు పవన్.
సినీ పరిశ్రమ సమస్యల్ని విన్నవించుకోవడానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ని చిరు అండ్ కో కలవడం, చిరు చేతులెత్తి నమస్కరించినా, జగన్ పట్టించుకోకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికీ పవన్ కల్యాణ్ ఆ విషయాన్ని ఏదో ఓ రూపంలో గుర్తు చేస్తూనే ఉంటాడు. తాజాగా చిరు పుట్టిన రోజు సందర్భంగా పవన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ నోట్ వదిలారు. ఇందులోనూ ఆ విషయాన్ని మళ్లీ గుర్తు చేశారు. చిరు కష్టాన్నీ, తన ప్రతిభనీ, ఎదిగినా ఒదిగుండే లక్షణాన్ని, దాన గుణాన్ని ఇలా.. వివరించుకుంటూ పోయిన పవన్…. “తాను కలవబోయే వ్యక్తి ప్రతినమస్కారం కూడా చేయలేని కుసంస్కారి అయినప్పటికీ తను చేతులెత్తి నమస్కారం శ్రీ చిరంజీవి సొంతం“ అంటూ… జగన్ ఎపిసోడ్ ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చాడు పవన్. ఓరకంగా ఇది పొలిటికల్ స్ట్రాటజీనే. చిరుని అభిమానించే వాళ్లకూ, చిత్రసీమని ప్రేమించే వాళ్లకూ ఈ ఎపిసోడ్ ఓరకంగా జీర్ణించుకోలేనిదే. వాళ్లంతా ఇప్పుడు జగన్ కి యాంటీగా మారే అవకాశం ఉంది. వాళ్లని తనవైపుకు తిప్పుకోవడానికీ, జగన్ సంస్కార రహిత ప్రవర్తనని జనాలకు చెప్పడానికి ఈ ఉదంతాన్ని పవన్ బాగానే హైలెట్ చేస్తున్నాడనుకోవాలి.
మనసున్న మారాజు అన్నయ్య శ్రీ @KChiruTweets గారు – JanaSena Chief Shri @PawanKalyan #HBDMegastarChiranjeevi pic.twitter.com/WV7KXxXuKV
— JanaSena Party (@JanaSenaParty) August 22, 2022