భారతీయ జనతా పార్టీ, జనసేన.. అమరావతి కోసం.. ఉద్యమించాలని నిర్ణయించుకున్నాయి. పవన్ కల్యాణ్.. ఈ విషయంలో మరింత సీరియస్గా ఉన్నారు. అమరావతి తరలింపు నిర్ణయం.. తాత్కాలికమేనని.. పవన్ కల్యాణ్ ఘంటాపథంగా చెబుతున్నారు. మళ్లీ శాశ్వత పాలనా రాజధానిగా అమరావతి ఉంటుందని అంటున్నారు. సోమవారం అత్యవసరంగా.. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ జరిపిన పవన్ కల్యాణ్… అసెంబ్లీలో చర్చలు జరిగిన తీరు.. బయట ఆందోళనల అంశాన్ని చర్చించారు. వైసీపీకి విశాఖపై ప్రేమలేదుని ..రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే విశాఖ రాజధాని అంటున్నారని పవన్ మండిపడ్డారు.
టీడీపీ చేసిన తప్పులే వైసీపీ చేస్తోందని .. అమరావతిని తరలించడం సాధ్యం కాదని తేల్చారు. 5 కోట్ల మంది ఆమోదించిన తర్వాత ఇప్పుడు రాజధాని తరలింపు ఏంటని అంటున్నారు. ప్రశాంతమైన విశాఖలో ఫ్యాక్షన్ పడగలు విప్పేలే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని మార్పుతో జగన్ తన వినాశనాన్ని కొని తెచ్చుకున్నాడని తేల్చారు. ఏపీలో పరిణామాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని జాతీయస్థాయిలో బలమైన మార్పులు జరగబోతున్నాయన్నారు. మరో జేపీ నడ్డా అధ్యక్షుడిగా ఎన్నికవుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా కూడా.. అమరావతి విషయంలో కేంద్రం అనుమతి ఉండాల్సిందేనని అంటున్నారు.
కచ్చితంగా కేంద్రం జోక్యం చేసుకుంటుందని తుగ్లక్ నిర్ణయాల కారణంగా.. రాష్ట్రం ఆర్థికంగా చితికిపోకుండా.. కేంద్రం జోక్యం చేసుకుంటుందని అంటున్నారు. రాజధాని మార్పు విషయంలో.. నోటిఫికేషన్ జారీకో.. మరో దానికో.. ఖచ్చితంగా.. కేంద్రానికి లేఖ రాయాల్సి ఉటుందని.. అలా రాసిన తర్వాత ఏం జరుగుతుందో.. చూస్తారని ఆయన అంటున్నారు. జనసేన, బీజేపీ కలిసి ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ కూడా ఖరారు చేసుకోవాలనుకుంటున్నాయి. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.