కేవలం నాలుగు వాక్యాల్ని టకటకా టైప్ చేస్తూ.. ట్విట్టర్ పోస్ట్ చేసి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నడపాలని పవన్ కల్యాణ్ అనుకుంటున్నట్టున్నారు. ప్రత్యేక హోదాపై మరోసారి స్పందించారు. జల్లికట్టు ఉద్యమ నేపథ్యంలో వరుస ట్వీట్లు పెడుతున్నారు. ఈసారి యువతను టార్గెట్ చేసుకున్నారు. ‘గాంధీని ప్రేమిస్తాం, అంబేద్కర్ ను ఆరాధిస్తాం, సర్దార్ పటేల్‌కి సెల్యూట్ చేస్తాం, రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. కానీ, తల ఎగరేసే ఉత్తరాధి నాయకత్వం దక్షిణాది ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ పోతే… చూస్తూ ఊరుకోం. మెడలు వంచి కూర్చోబెడతాం. తిడితే భరించాం. విడగొట్టి గెంటేస్తే భరించాం. ఇచ్చినమాట నిలబెట్టుకోకపోతే తిరగబడతాం… అనేది ఆంధ్రా యువత కేంద్రానికి చెప్పాలి’ – ఇదీ పవన్ కల్యాణ్ తాజా ట్వీట్.
మాంచి పంచ్ ఉన్న పదప్రయోగాలతో బాగానే ట్వీట్ చేశారు. కానీ, ఇంకెన్నాళ్లీ బుల్లిపిట్ట అరుపులు! ప్రత్యేక హోదా ఉద్యమం పేరుతో గతంలో కొన్ని సభలు పెట్టారు. ఇప్పుడు కొన్ని ట్వీట్లు పెడుతున్నారు. ఉద్యమాన్ని నడిపే తీరు ఇదేనా..? జనసేనకు నిజంగానే ప్రత్యేక హోదా పట్ల అంత నిబద్ధత ఉంటే ఇప్పటికైనా పవన్ కల్యాణ్ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కావాలి. తిరగబడాలంటూ ఆంధ్రా యువతకు చెప్పడం కాదు… ఆ తిరుగుబాటుకు ఆయనే నాయకత్వం వహించాల్సిన తరుణం ఇదీ అంటూ అభిమానులు కూడా ఆశిస్తున్నారు.
ప్రత్యేక హోదా హీట్ ఆంధ్రా ప్రజల్లో ఇప్పటికీ ఉంది. చంద్రబాబు సాధించలేకపోయారన్న ఆగ్రహం ఉంది. కేంద్రం మోసం చేసిందన్న ఆవేశమూ ఆవేదనా ఉన్నాయి. ప్రజల్లో గూడుకట్టున్న ఈ అసంతృప్తిని ఏకతాటిపైకి నడిపించగల నాయకుడే ఇప్పుడు అవసరం! ఆ నాయకుడు పవన్ కల్యాణ్ అయితే బాగుంటుందన్న ఆశ కూడా ఆంధ్రుల్లో ఇప్పటికీ ఉంది! ఇక ఉండాల్సిందీ… చేయాల్సిందీ.. స్పందించాల్సిందీ.. పవన్ కల్యాణ్ మాత్రమే. ముందుగా, ఆ ట్విట్టర్‌ను వదిలేసి, ఏం చెప్పాలనుకున్నా జనంలోకి వచ్చి చెబితే బాగుంటుంది. ఓరకంగా పవన్ కల్యాణ్‌కు ఇదే చివరి అవకాశం అని కూడా చెప్పాలి!
ప్రస్తుతానికి పవన్ పెడుతున్న ట్వీట్లు అభిమానుల్ని ఉత్తేజపరుస్తున్నాయి. కానీ, ఇలా ట్వీట్లకే పరిమితమైతే.. రానురానూ వీటికి స్పందింపజేసే గుణం తగ్గిపోతూ ఉంటుంది. అందుకే, పవన్ కదనరంగంలోకి దూకాల్సిన తరుణం ఇదే అని చాలామంది అంటున్నారు. మరి, పవన్ ఈ విషయాన్ని ఇప్పటికైనా గుర్తిస్తారా..?
#APDemadsSpecialStatus ,If youth of AP are planning to do a silent protest on 26th Jan at RK Beach , Vizag, #Janasena Supports them.
— Pawan Kalyan (@PawanKalyan) January 22, 2017
#APDemadsSpecialStatus,I had planned a Musical protest album#DeshBachao to be released on 5th Feb but will prepone its release to 24th Jan.
— Pawan Kalyan (@PawanKalyan) January 22, 2017
#APDemandsSpecialStatus ,Does the North Indian political elites know! 'How many languages are there in south'? For them we are all Madrasis!
— Pawan Kalyan (@PawanKalyan) January 23, 2017
#APDemandsSpecialStatus pic.twitter.com/NcAfOro0i3
— Pawan Kalyan (@PawanKalyan) January 23, 2017
#APDemandsSpecialStatus pic.twitter.com/aYrhnf6rIF
— Pawan Kalyan (@PawanKalyan) January 23, 2017
The muscle called "Courage"& the qualities -"self respect, integrity & accountability" are lacking in political class of AP.
— Pawan Kalyan (@PawanKalyan) January 23, 2017
#APDemandsSpecialStatus ,"Youth of AP"should raise their voice through peaceful protests is the only remedy ,to achieve the promised "SCS"
— Pawan Kalyan (@PawanKalyan) January 23, 2017