జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నాలుగు జిల్లాల్లో వారాహి యాత్ర చేశారు. రోజులకు రోజులు గడిచిపోతున్నాయి కానీ ఆయన మాత్రం మళ్లీ ప్రచారబరిలోకి దిగలేదు. ఎన్నికల షెడ్యూల్ మరో ఇరవై రోజుల్లో రానుంది. ఈ సమయంలో చంద్రబాబు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సభలు పూర్తి చేశారు. ఇప్పుడు పొత్తులు, టిక్కెట్ల ఖరారుపై కసరత్తు చేస్తున్నారు. నారా లోకేష్ శంఖారావం సభలతో రోజుకు మూడు నియోజకవర్గాలు పర్యటిస్తున్నారు. కానీ పవన్ మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. చాలా రోజుల తర్వాత రెండు గోదావరి జిల్లాల్లో కార్యక్రమాలు పెట్టుకున్నారు. కానీ హలికాఫ్టర్ ల్యాండింగ్ కు పర్మిషన్ ఇవ్వలేదని టూర్ రద్దు చేసుకున్నారు.
నిజానికి విజయవాడ నుంచి కాకినాడ పెద్ద దూరమేం కాదు. కారులో వెళ్లొచ్చు. కానీ పవన్ కు .. ఈ టూర్ పై పెద్దగా ఆసక్తి లేదని అందుకే వాయిదా వేసుకున్నారని అంటున్నారు. జనసేనకు ఇస్తామన్న సీట్లు ఫైనల్ కాకపోవడం.. పార్టీ నేతల నుంచి టిక్కెట్ల కోసం ఒత్తిడి ఇలా పవన్ .. పార్టీ వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉన్నారని అంటున్నారు. అదే సమయంలో బీజేపీతో పొత్తు వ్యవహారం తేలకపోవడం.. డిల్లీ పర్యటన కూడా కాన్సిల్ అయింది. ఈ పరిణామాలతో ముందుగా.. ఎన్నికల సన్నాహాలను పూర్తి చేసుకుని ఆ తర్వాత ప్రచార బరిలోకి దిగాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
చిన్న చిన్న పొరపాట్లు జరిగినా.. ఓటు బదిలీ ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో వ్యవహారాలన్నీ సింపుల్ గా జరిగిపోవాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.