గతంలో హిందీ భాష అంశంలో తాను చేసిన వ్యాఖ్యలు, ట్వీట్లు వైరల్ కావడంతో పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాను ఎప్పుడూ హిందీని భాషగా వ్యతిరేకించలేదని అన్నారు. నూతన జాతీయ విద్యావిధానం 2020 పేరుతో హిందీన్ని బలవంతగా రుద్దుతారేమో అని ఆందోళన వ్యక్తి చేసినట్టు తాజాగా చేసిన ట్వీట్లో తెలిపారు.
ఒక భాషను బలవంతంగా రుద్దడం లేదా భాషను గుడ్డిగా వ్యతిరేకించడం రెండూ తప్పే అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అదిదేశ సమగ్రతకు ఇది మంచిది కాదన్నారు. హిందీని తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు పవన్ కల్యాణ్ దాన్ని తప్పనిసరిగా నేర్చుకోవాలనే వాదనను మాత్రమే తప్పుపట్టినట్టు తెలిపారు. కొత్తగా అమలు చేస్తున్న న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం విద్యార్థులు ఏవైనా రెండు భారతీయ భాషలు నేర్చుకోవచ్చని తెలిపారు. ఇందులో వారి మాతృభాష కూడా ఉంటుందన్నారు.
భాషా వైవిధ్యాన్ని పెంచడం కోసం జాతీయ ఐక్యత పెంపొందించడం కోసం ఈ మల్టీలాంగ్వేజ్ పాలసీ తీసుకొచ్చారని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇందులో రాజకీయాలు జొప్పించి ప్రజలను తప్పుదారి పట్టించడమే కాకుండా పవన్ మాట మార్చారని విమర్శలు చేస్తూ అవగాహనా లోపాన్ని బహిర్గతం చేసుకుంటున్నారని విమర్శించారు ప్రతి భారతీయుడికి భాషా స్వేచ్ఛ, విద్యా ఎంపిక సూత్రానికి జనసేన ఎప్పుడూ దృఢంగా కట్టుబడి ఉందన్నారు.