నాని కథానాయకుడిగా నటించిన చిత్రం `అంటే.. సుందరానికీ..`. ఈనెల 10న విడుదల అవుతోంది. ప్రమోషన్స్ పీక్స్ లో జరుగుతున్నాయి. 9న హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో.. ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఈ ప్రమోషన్ ఈవెంట్ కి బిగ్ షినిష్ ఇవ్వాలి కదా..? అందుకే పవన్ కల్యాణ్ ని తీసుకొస్తున్నారు. 9న జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ పాల్గొంటారని చిత్రబృందం ప్రకటించింది. పవన్ కల్యాణ్ ఇప్పుడు పొలిటికల్ గా బిజీ అయిపోయారు. సినిమా వేడులకు ఆయన హాజరవ్వడం.. చాలా అరుదుగా జరిగే విషయం. పవన్ వస్తే మాత్రం.. ఆ ఈవెంట్ సమ్థింగ్ స్పెషల్ గా మారుతుంది. మైలేజీ వస్తోంది. అందుకే పవన్ కోసం పరుగులు తీస్తుంటారు దర్శక నిర్మాతలు. మైత్రీ మూవీస్ సంస్థలో పవన్ ఓ సినిమా చేస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకుడు. ఆ ఆబ్లిగేషన్ తోనే పవన్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.