ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరు నెలల పాలన తర్వాత.. చాలా మంది నుంచి వస్తున్న విమర్శలు.. చేస్తున్న విశ్లేషణల్లో ప్రధానంగా.. వినిపిస్తున్నది.. ఆయన పాక్షికత.. వివక్ష గురించే. జనసేన అధినేత పవన్ కల్యాణ్… ఇదే విషయాన్ని ప్రకటించారు. జగన్ రెడ్డి తాను.. సంబోధించడానికి కారణం .. ఆయన కొంత మందికి మాత్రమే.. మేలు చేసేలా వ్యవహరిస్తూండటమేనన్నారు. పవన్ కల్యాణ్ నేరుగా చెప్పారు.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ… చాలా కాలంగా ఇదే తరహా విమర్శలు చేస్తోంది.
టార్గెట్ చేసిన సామాజికవర్గం ఏపీ ప్రజలు కారా..?
విపక్ష పార్టీల ఆరోపణలు మాత్రమే.. కాదు… ప్రభుత్వం కూడా.. స్వయంగా.. నిర్ణయాల్లోనూ… ప్రకటనల్లోనూ… కొంత మందిపై వివక్ష చూపిస్తోంది. ఈ విషయం.. అనేక సందర్భాల్లో స్పష్టమయింది. ముఖ్యమంత్రి… అంటే.. ఏపీలోని ఐదు కోట్ల మంది ప్రజలకు ముఖ్యమంత్రి. కానీ… ఏపీ సర్కార్ తీరు ఓ సామాజికవర్గంపై.. పూర్తిగా కక్ష కట్టినట్లుగా ఉంది. స్వయంగా మంత్రి బొత్స సత్యనారాయణ… ఓ సామాజికవర్గం కోసమే రాజధాని అని.. ఆ సామాజికవర్గం కోసం తాము పని చేయడం లేదని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఇలా.. ఓ సామాజికవర్గాన్ని వెలి వేసినట్లుగా ప్రకటనలు చేయడం …ఇంత వరకూ ఏ ప్రభుత్వమూ చేయలేదు. ఇది కచ్చితంగా వివక్ష చూపించడమేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
కుల మతాల వారీగా పథకాల లబ్దిదారుల ఎంపిక ఎందుకు..?
అదే సమయంలో.. ప్రభుత్వం కూడా… కొన్ని వర్గాలకు.. కొంత మందికే లబ్ది చేకూర్చేలా… పథకాల నిబంధనలు ప్రకటించింది. రైతు భరోసా పథకం కింద… కౌలు రైతుల్ని కులాల వారీగా వర్గీకరించింది. దీంతో.. ఓ ప్రభుత్వ పథకంలో.. కులం ప్రకారం.. కొంత మందిని అనర్హుల్ని చేసిన మొదటి సర్కార్‌గా…నిలిచింది. ఇక ప్రభుత్వం తీరు మత పరమైన విభజనకు కూడా కారణం అవుతోందన్న విమర్శలు కొద్ది రోజులుగా తీవ్రంగా వినిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ మతాన్ని ఆచరిస్తారు. మత స్వేచ్ఛ అందరికీ ఉన్నప్పటికీ.. ప్రభుత్వ నిర్ణయాలు.. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు.. మంత్రులు… మత మార్పిళ్లను ప్రోత్సహించడం… హిందూ ఆలయాలను కించపర్చడం వంటి పనులు చేస్తున్నారు. క్రైస్తవుల కోసం.. ప్రత్యేకంగా పథకాలు ప్రవేశ పెడుతున్నారు. పలితంగా ఏపీ సర్కార్‌పై మత ముద్ర పడుతోంది.
అందరివాడినని మాటల్లో చెప్పుకుంటే కాదు…. చేతల్లో చూపించాలి..!
సీఎం.. తాను అందరి వాడినని.. మాటల్లో చెబితేనే… విపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చినట్లు కాదు. ప్రతిపక్ష పార్టీలు.. జగన్ నిర్ణయాలను ఎత్తి చూపి.. కొందరికి మాత్రమే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వాదిస్తున్నారు. ఆ నిర్ణయాల్లో.. పాక్షికత లేదని.. ప్రభుత్వం చేతలతో నిరూపించాల్సి ఉంది. కొంత మందిపై.. వివక్ష చూపించడం లేదని.. వెల్లడించాల్సి ఉంది. ఆయనకు ఆ ఉద్దేశం లేదు. కొంత మందిని సంతృప్తి పరిచి వారిని ఓటు బ్యాంక్‌గా మార్చుకుంటే చాలని ఆయన భావిస్తున్నారు.