జిల్లాల వారీగా.. జనసైనికులతో.. సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్…. మెల్లమెల్లగా.. తన స్ట్రాటజీని మార్చుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాను ఎప్పుడూ రాజుకీయాల్లో అత్యంత హుందా తనాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. కడప జిల్లా జనసైనికులతో సమీక్ష చేసిన పవన్ కల్యాణ్.. జగన్ వ్యక్తిగత ప్రవర్తన తీరును ఎండగట్టే ప్రయత్నం చేశారు. గతంలో… జగన్.. చంద్రబాబును నిలబెట్టి కాల్చేయాలని చెప్పడం.. ఏదైనా బావిలో దూకమని సలహా ఇవ్వడం వట్టి .. ప్రకటలను గుర్తుకు వచ్చేలా.. జగన్ పై విమర్శలు చేశారు. జగన్‌లా చంపేయండి, చింపేయండని నేనెప్పుడూ మాట్లాడలేదని… ఏ విమర్శ చేసినా ఆదర్శవంతమైన భాషనే ఉపయోగించానని చెప్పుకొచ్చారు. ఏపీకి దిశానిర్దేశం చేసేందుకే మూడోపక్షంగా జనసేనను స్థాపించానన్నారు. రాజకీయాల్లో ఆధిపత్యం కోసం కాకుండా… వ్యవస్థలో మార్పుల కోసం జనసైనికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
యువతను రాజకీయ శక్తిగా మార్చే బాధ్యత తీసుకుంటానని.. ఐడియాలజీ, ప్రాక్టికాలిటీతో ముందుకెళ్తానని కడప జన సైనికులకు హామీ ఇచ్చారు.2003 నుంచి డబ్బు ప్రభావిత రాజకీయాలు పెరిగాయన్నారు. మార్పు కోసమే జనసేనను స్థాపించానని.. పీఆర్పీ కంటే ముందే కామన్‌మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టానని గుర్తు చేసారు. 2003లోనే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని.. ఆ తర్వాత చిరంజీవి పీఆర్పీ పెట్టారన్నారు.అధికారం కోసం చూసేవారికి ప్రజాసంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉండదుదన్నారు. జగన్, చంద్రబాబు ఇద్దరూ అధికారం కోసమే చూస్తున్నారన్నారు. రాజకీయాలు తనకు వ్యాపారం కాదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో డబ్బు ప్రభావిత రాజకీయాలు పెరిగాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.
జిల్లాల వారీగా జనసైనికులతో సమావేశమవుతున్న పవన్ కల్యాణ్… నియోజకవర్గాల ఇన్చార్జ్ ల నియామకంపైనా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాల నుంచి ఫ్యాన్స్ వస్తున్నారు తప్ప .. నాయకులు ఎవరూ రావడం లేదు. చాలా జిల్లాల్లో ఓ మాదిరి నేతలు కూడా లేకపోవడంతో.. ఫ్యాన్స్ అసోసియేషన్ వారే వస్తున్నారు. పవన్ వారికే దిశానిర్దేశం చేస్తున్నారు.