జనసేన అధినేత పవన్ కల్యాణ్..వారాహి యాత్రలో జగన్ రెడ్డిని ఏక వచనంతో సంబోధిస్తూ.. చేస్తున్న విమర్శలకు.. ఎలా స్పందించాలో మంత్రులకు అర్థం కావడం లేదు. ఏదో ఒకటి చేసి టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అక్కడా ఇక్కడా తిట్ల వర్షమే వస్తుంది. అయినా సరే.. పవన్ కల్యాణ్.. తెలంగాణ మంత్రులు అంటే పడవచ్చని అనుకుంటున్నారు.
సమయం, సందర్భం లేకుండా తెలంగాణలో విద్యా వ్యవస్థపై మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన లాంగ్వేజ్ లో విమర్శలు చేశారు. అర్థం చేసుకున్న వారికి చేసుకున్నంత అన్నట్లుగా ప్రో వైసీపీ మీడియా కావాల్సినంత ప్రచారం చేసింది. ఇలాంటిదేదో మాట్లాడతారు.. రెడీగా ఉండండి అని ఎవరో చెప్పినట్లుగా.. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ మీడియా గొట్టాల ముందుకు వచ్చి…. ఎక్కువగా ఏపీని..కాస్తంత బొత్స, వైసీపీని విమర్శించారు.దీనికి ఆయా మీడియా సంస్థలు ప్రయారిటీ ఇచ్చాయి. కానీ ఈ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలకు అలవాటుపడిపోయిన ప్రజలు పట్టించుకోలేదు. దీంతో బొత్స .. కెలికి మరీ విమర్శింపచేసుకున్నట్లయింది కానీ ప్రయోజనం లేకపోయింది.
పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో రేపిన వాలంటీర్ల వ్యవహారం, డేటా చోరీ వ్యవహారంపై దృష్టి మరల్చతకపోతే మొదటికే మోసం వస్తుందని .. వైసీపీ కంగారు పడుతోంది. అందుకే బొత్సతో ఓ ప్రయత్నం చేసింది. కానీ వర్కవుట్ అయిన సూచనలు కనిపించడం లేదు.