ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు అంటే పవన్ కల్యాణ్‌కి బొత్తిగా ఇష్టం ఉండదు. ఆయన సినిమాలు కామ్ గా వస్తాయి… బాక్సాఫీసుని గడగడలాడించి వెళ్తాయి. అయితే… ఈమధ్య పవన పబ్లిసిటీపైనా కాస్త దృష్టి పెట్టాడు. పవన్ కల్యాణ్ క్రియేటీవ్ వర్క్స్ అంటూ… నిర్మాణ భాగస్వామ్యం కూడా తీసుకొన్నాడు కదా. అందుకే ప్రమోషన్లను పట్టించుకోవడం తప్పట్లేదు. అందులో భాగంగా కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటూ.. ఒకటి ఏర్పాటు చేశారు. ఈనెల 18న హైదరాబాద్‌లో ఈ ఈవెంట్ జరగబోతోంది. శిల్పకళావేదికని ఫైనలైజ్ చేశారు. అన్నట్టు… ఈ ఫంక్షన్లో మరో సర్ప్రైజ్ కూడా ఉంది. అదేంటో తెలుసా??
పవన్ కల్యాణ్ పరిశ్రమకు వచ్చి 20 యేళ్లు అయ్యింది. ఆ ఈవెంట్‌ని కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో గ్రాండ్‌గా చేయాలని చిత్రబృందం భావిస్తోందట. పవన్ తొలి చిత్రం అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి వచ్చి గత అక్టోబరుకి 20 యేళ్లు అయ్యింది. అక్టోబరు నుంచి ఇప్పటి వరకూ పవన్‌కి సంబంధించిన సినిమా ఫంక్షన్ ఏం జరగలేదు. అందుకే కాటమరాయుడులో పవన్ 20 ఇయర్స్ సెలబ్రేషన్ చేయాలని భావిస్తోంది చిత్రబృందం. నిజానికి ఈ ఈవెంట్‌ని స్పెషల్‌గా ప్లాన్ చేశాడట శరత్ మరార్. కానీ పవన్ మాత్రం.. ”గ్రాండ్‌గా చేయొద్దు. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌తో పాటు కలిపి చేసేయండి” అన్నాడట. దాంతో… రెండు వేడుకల్నీ ఇలా ఒకే వేదికపై చేయడానికి ఫిక్స్ అయ్యారన్నమాట.