చంద్రబాబునాయుడు మండపేటలో టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తారని ప్రకటించడంపై పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంపై పవన్ కల్యాణ్ స్పందించారు. పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ సీట్లు అనౌన్స్ చేయకూడదు చేశారు. అందుకు పార్టీ నేతలకు నేను క్షమాపణలు చెప్తున్నానన్నారు. టీడీపీ సీట్లు అనౌన్స్ చేయడం పార్టీలోని కొందరు నేతలను ఆందోళనకు గురి చేసింది. లోకేష్ సీఎం పదవి గురించి మాట్లాడిన నేను పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రయోజనలు దృష్టికి పెట్టుకొని నేను మౌనంగా ఉంటున్నానన్నారు. సీనియర్ నేతగా ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అలా జరుగుతూ ఉంటాయి.
అనుకోకుండా కొన్ని జరుగుతాయి వాటిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. పార్టీ నేతలు అర్దం చేసుకోవాలని కోరుతున్నానన్నారు. పొత్తును ఇబ్బందులకు గురి చేసేలా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం 2024 లో మళ్ళీ అధికారంలోకి రాకూడదనేదే లక్ష్యమన్నారు. మండపేట నుంచి చాలా మంది నాయకులు వచ్చారు. చాలా బాధపడిపోతున్నారు. మండపేటలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించడం బాగా లేదన్నారు. నిజంగానే అది చెప్పాల్సింది పార్టీ నేతల అభిప్రాయాలతో ఏకీభవిస్తాను. చాలా ఇబ్బంది పడ్డాం. గత ఎన్నికల్లో 18 శాతం ఓటింగ్ ఉంది. అది ఇవాళ చాలా బలమైనదిగా ఉంది. ఇప్పుడు అది పదిశాతం పెరిగింది.
అయితే నేను ఒక నియోజకవర్గం గురించి మాట్లాడితే ఆ ప్రాంత లీడర్నే అవుతాను. నేను రాష్ట్రాన్ని యూనిట్‌గా చూస్తాను . దీని వల్ల కొన్నిసార్లు ఇబ్బంది కలగవచ్చు. పొత్తు ధర్మం ప్రకారం ప్రకటించకుండా ఉండాల్సింది. నేను పార్టీ లీడర్లకు క్షమాపణ చెబుతున్నాను. వచ్చే సమావేశాల్లో మాట్లాడి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతామన్నారు. రాజోలు, రాజానగరం నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని చెప్పారు.