అక్టోబర్ 31వ తేదీన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ విశాఖలో బహిరంగసభ నిర్వహించారు. ప్రైవేటీకరణ ఆపేందుకు ఏం చేస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టారు. వారం రోజులు సమయం ఇచ్చారు. ఆ లోపు చెప్పకపోతే తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అయితే పవన్ కల్యాణ్ డెడ్‌లైన్‌ను అధికార పార్టీ పట్టించుకోలేదు. పైగా నువ్వెవడికి మాకు డెడ్ లైన్ పెట్టడానికంటూ మంత్రులు తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఇచ్చిన డెడ్ లైన్ కూడా ముగిసింది. జనసేనాధినేత ఏం చేయబోతున్నారన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.
పవన్ కల్యాణ్ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే గతంలో చాలా సార్లు ఇలాంటిసవాళ్లు చేసి.. డెడ్ లైన్ పెట్టి పట్టించుకోలేదు. అదే తరహాలో ఇప్పుడూ మర్చిపోతే ఆయన డెడ్ లైన్లకు విలువ లేకుండా పోతుంది. పైగా స్టీల్ ప్లాంట్ ఇష్యూ సున్నితమైనది. తప్పనిసరిగా లీడ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమానికి మద్దతు ప్రకటించి.. తర్వాత సైలెంటయిపోయాయి. జనసేన ఆఖరిలో వచ్చింది. ఎలాగైనా సరేపోరాటం చేయాలన్న పట్టుదలను పవన్ ప్రదర్శించారు. అందుకే అన్ని పార్టీలను కలుపుకుని ఉద్యమం నడిపే ప్రయత్నాలు చేయాలన్న సూచనలు వస్తున్నాయి.
అయితే పవన్ కల్యాణ్ కూడా ఈ అంశంలో సీరియస్‌గానే ఉన్నారు. ఉద్యమం చేయాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నారు. మూడు రోజుల కింట నాటి స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో బుల్లెట్ గాయాలైన వ్యక్తిని పరిచయం చేసిపోరాటం ెలా ఉండబోతోందో చెప్పారు. అందుకే పవన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టబోయే కార్యాచరణపై ఆసక్తి వ్యక్తమవుతోంది.