పవన్ కల్యాణ్ ప్రత్యేకహోదా కోసం ఆమరణదీక్ష చేస్తానని గతంలో ప్రకటించారు. కానీ అంతకంటే ముందుగానే.. మరో కాజ్ కోసం ఆమరణ దీక్ష చేస్తున్నారు. తనపై జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా పవన్ దీక్షకు కూర్చుంటున్నారు. మూడు రోజుల పాటు ఈ దీక్ష జరుగుతుంది. ఫిల్మ్ చాంబరే దీనికి వేదిక కాబోతోంది. తెలుగుదేశం పార్టీపైన, లోకేష్ పైన, మీడియాపై తీవ్రమైన ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్… వీటినే కారణంగా చూపి నిరాహారదీక్షకు సిద్ధమయ్యారు.
టీవీలు టీఆర్పీల కోసం … ఎంతకైనా దిగజారిపోతున్నాయని పవన్ కల్యాణ్ ట్వీట్లలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్లు అన్నిటిలో .. మదర్ ఆఫ్ ఆల్ షోస్ లాంటి షో తాను చూపిస్తానని పవన్ కల్యాణ్ అర్థరాత్రి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో అర్థం ఆమరణదీక్షనేనన్న అభిప్రాయాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
పవన్ కల్యాణ్ కు మెగా ఫ్యామిలీ మొత్తం మద్దతు ప్రకటిస్తోంది. సినీ ఇండస్ట్రీపై జరుగుతున్న దాడిగా భావిస్తున్న సినీజనం కూడా పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకిటంచే అవకాశం ఉంది. ఇందులో ఎంత మేర రాజకీయం ఉంది..ఎంత మేర ఇండస్ట్రీ కాజ్ ఉందన్నది తేలిన తర్వాత పవన్ కల్యాణ్ కు మరింత మద్దతు లభించే అవకాశం ఉంది. మొత్తానికి టాలీవుడ్ వేదికగా ఓ సంచలనం జరగబోతున్నట్లు భావించవచ్చు.