సినిమాలు చేయనే చేయనని చెప్పిన పవన్ కల్యాణ్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సినిమా తన బతుకుదెరువు అని చెప్పి మళ్లీ సినిమాలు చేస్తున్నారు. పార్టీని నాదెండ్ల మనోహర్‌కు అప్పగించారు. మొత్తం పార్టీని నాదెండ్ల నడుపుతున్నారు. ఇక ఎన్నికల వేడి ప్రారంభమైంది జగన్ ముందస్తుకు వెళ్తారు అనే వాతావరణం వచ్చినా పవన్ కల్యాణ్‌లో పెద్దగా మార్పు లేదు. పవన్ కల్యాణ్ చాలా సినిమాల కమిట్ మెంట్స్ పెట్టుకున్నారు. వాటిని చేస్తూనే రాజకీయ పార్టీకి సమయం కేటాయించాల్సిన పరిస్థితి. ఇప్పటికీ పవన్‌కు తీరిక లేని షెడ్యూల్ ఉంది.
పవన్ కల్యాణ్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలి. అయితే గెలవాల్సింది పార్టీ కాదు. ఆయనైనా గెలవాలి. గత ఎన్నికల్లో సామాజిక వర్గ పరంగా కూడా ఎంతో ప్లస్ అవుతుందని పోటీ చేసిన భీమవరం, గాజువాకల్లోనే కలసి రాలేదు. ఈ సారి ఆయన మరింత పకడ్బందీగా వ్యవహరించాలి. పవన్ కల్యాణ్‌కు ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఓటేసిన తరవాత ఆయన సినిమాలు చేసుకుంటారనే డౌటే ఎక్కువ మందికి ఉందని రాజకీయవర్గాల అభిప్రాయం. బయటపడరు కానీ జనసైనికులదీ అదే అభిప్రాయమని చెబుతారు.
పవన్ కల్యాణ్ ఇప్పటికైనా వెంటనే పూర్తి స్థాయిలో రాజకీయాలు ప్రారంభించకపోతే ప్రజల్లో సీరియస్ నెస్ పోతుంది. అయితే ఎప్పట్లాగే ఇలాగే రాజకీయం చేసి పోటీ చేసి.. ఆరేడు శాతం ఓట్లు సాధించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. చట్టసభల్లో సీట్లు ఉంటేనే విలువ. తనకు ఆరేడు శాతం ఓటు బ్యాంక్ ఉందని అనుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే ఇప్పుడు పవన్ ను ఎలాగైనా చట్టసభల్లోకి పంపాలని జనసేన పార్టీ మొత్తం మిషన్‌గా పెట్టుకుంది. పవన్ ఎక్కడ పోటీ చేసినా అక్కడ జగన్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తారని చెప్పాల్సిన పని లేదు. అందుకే పవన్ కు ఈ సారి లిట్మస్ టెస్ట్ ఎదుర్కోవడం ఖాయమని అనుకోవచ్చు