వైసీపీ నేతలు అనే మాటలకు తన భార్య కూడా ఏడుస్తోందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. దెందులూరులో పార్టీ కార్యకర్తలతో పవన్ కల్యాణ్ మాట్లారారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు తనపై చేస్తున్న వ్యక్తిగత దాడి గురించి ప్రస్తావించారు. తనను, తన కుటుంబ సభ్యులను నిందించొచ్చు.. కానీ తాను అలా అనని పేర్కొన్నారు. జగన్ సంస్కార హీనుడు అని.. అతను చదువుకోలేదని మండిపడ్డారు. తాను రోజుకు రూ.2.5 కోట్లు సంపాదించగలనని.. ఏడాదికి కనీసం 200 రోజులు పనిచేస్తే రూ.400 కోట్లు సంపాదిస్తానని పవన్ కల్యాణ్ వివరించారు. వైసీపీ పార్టీ జగన్ ది కాదని, వేరే వాళ్ల దగ్గర నుంచి ఆ పార్టీని తీసుకున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు రైతుల పొట్టగొట్టి, శ్రామికులను దోచుకున్న పార్టీ వైసీపీ అని విమర్శించారు.
ఇటీవల పవన్ కల్యాణ్ భార్య విషయంలో.. వైసీపీ నేతలు అత్యంత దారుణమైన , అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ తల్లి కులం గురించి కూడా కొంత మంది నేతలతో అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో పవన్ కల్యాణ్ తన కుటుంబంపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో.. తన భార్య కూడా కన్నీరు పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఈ సమావేశంలో వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కల్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
వాలంటీర్లు సేకరించే అతి సున్నితమైన సమచారాన్ని ప్రభుత్వంలో పని చేసే కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపిస్తున్నారు. అందర్నీ అనట్లేదు కానీ కొందరు వ్యక్తులు ఆడపిల్లలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కేంద్రంలోని చాలా పెద్ద స్థాయి నిఘా సంస్థల్లో పని చేసే వ్యక్తులు కూడా రాష్ట్రంలో ఆడపిల్లల అదృశ్యాలకి కొందరు రాజకీయ నాయకులకు సంబంధం ఉంది అని చెప్పారని అంటున్నారు. అందుకే వాలంటీర్లకు సమాచారం ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. సున్నితమైన సమాచారాన్ని ఇవ్వకండని ప్రజలకు పిలుపునచ్చారు. ఈ విషయం చెప్పినందుకు నువ్వు నా మీద ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చని పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి సవాల్ చేశారు.