జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మరోసారి టైమ్ మిస్సయ్యారు. అమరావతి రైతుల ఉద్యమం నాలుగో తేదీకి రెండు వందల రోజులు పూర్తయింది. ఆ సందర్భంగా.. రైతుల కోసం.. ఒక్క ప్రకటన జనసేన.. లేదా జనసేనాని వైపు నుంచి రాలేదు. దేశ విదేశాల నుంచి అమరావతికి మద్దతుగా తెలుగువారే కాదు.. అన్ని వర్గాలు.. సంస్థల నుంచి మద్దతు లభించింది. కానీ.. అమరావతికి మాత్రమే తమ మద్దతు అని చెప్పిన పవన్ వైపు నుంచి స్పందన రాలేదు. కనీసం.. వర్చువల్ మీటింగ్‌లో అయినా ప్రసంగిస్తారేమోనని ప్రయత్నించిన అమరావితి జేఏకి ప్రయోజనం లభించలేదు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. అయితే.. పవన్ కల్యాణ్ అనూహ్యంగా రెండు రోజుల తర్వాత… అమరావతి రైతులకు సంఘిభావంగా ఓ ప్రకటనను విడుదల చేశారు.
రెండు వదల రోజుల ఉద్యమాన్ని పూర్తి చేసుకుంటున్న అమరావతి రైతులకు.. రైతు కూలీలకు సంఘిభావం తెలియచేస్తున్నానని ఓ ప్రకటన విడదలయింది. ప్రభుత్వాలు ఎప్పుడూ ఒకటేనని.. ఆ ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం అని వేరు చేయకూడదని పవన్ ప్రభుత్వానికి లేఖలో పిలుపునిచ్చారు. రైతులు ప్రభుత్వానికి భూములు ఇచ్చారు కాబట్టి.. ఒప్పందాలను గౌరవించాలన్నారు. ఒక వ్యక్తికో.. పార్టీకో రైతులు భూములు ఇవ్వలేదని గుర్తుంచుకోవాలన్నారు. ప్రస్తుతం రైతులకు కౌలు కూడా.. ప్రభుత్వం ఇవ్వడం లేదని ఏప్రిల్‌లో నెలలో ఇవ్వాల్సినవి ఇప్పటికీ ఇవ్వకపోవడం.. వారిని వేధించడమేనని మండిపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే.. రాజధానిని మూడు ముక్కలు చేయడం కాదన్నారు.
ఏదైనా ఉద్యమం మైలు రాయి చేరుకున్నప్పుడే మద్దతు ప్రకటించాలి.. అప్పుడే టైమింగ్ కరెక్ట్‌గా ఉంటుంది. రెండు వందల ఉద్యమం మైలు రాయి సందర్భంగా అందరూ సంఘిభావం చెబుతున్నప్పుడు పవన్ సైలెంట్‌గా ఉండిపోయారు. రెండురోజుల తర్వాత తన మద్దతు తెలిపారు. పవన్ లేటు స్పందన వల్ల…రైతులకు నైతిక మద్దతు వస్తుందా.. లేదో చెప్పలేము కానీ… 200వ రోజు చెప్పకపోవడం వల్ల మాత్రం.. రైతులు నిరాళ చెందారు. పవన్ కల్యాణ్ ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పలేమన్న.. వ్యాఖ్యలు ఉద్యమ నేతల్లో వినిపించాయి.