జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏదైనా అట్టహాసంగా ప్రకటిస్తారు. కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఫెయిలవుతున్నారు. ఈ విషయం మరోసారి దామోదరం సంజీవయ్యను ఓన్ చేసుకునే విషయంలో నిరూపితమయింది. దామోదరం సంజీవయ్య శత జయంతి ఉత్సవాలను నిర్వహించారు. దీనికి తెలంగాణ నుంచి వీహెచ్ లాంటి వాళ్లు హాజరయ్యారు. కానీ జనసేన పెద్దగా పట్టించుకోలేదు. పవన్ గతంలో పవన్ కల్యాణ్ దామోదరం సంజీవయ్య స్మారకం కోసం రూ. కోటి విరాళం ప్రకటించారు. ఆ కోటితో పాటు నిధిని ఏర్పాటు చేసివిరాళాలు సేకరించి ఆయన స్మారకం నిర్మిస్తామన్నారు.
పవన్ కల్యాణ్ మాత్రం ఆయన మంచి పనులన్నింటినీ వెలుగులోకి తెచ్చారు. ఏపీకి తొలి దళిత ముఖ్యమంత్రి అయిన సంజీవయ్య . హైదరాబాద్ పరిసరాల్లో 6లక్షల ఎకరాలను పేదలకు పంపిణీ చేశారు. వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు ప్రారంభించారు. బోయలు, కాపు కులాలను బీసీల్లో చేర్చారు. వీటన్నింటినీ పవన్ కల్యాణ్ బాగా ప్రచారం చేశారు. దళిత నేత అయిన సంజీవయ్యను బీజేపీ పటేల్‌ను ఉపయోగించుకున్నట్లుగా సంజీవయ్య సేవలను జనసేన అడాప్ట్ చేసుకుని.. దళిత వర్గాల్లో మరింత ఓటు బ్యాంక్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తారని అనుకున్నారు.
ఇటీవల కొత్తగా కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని పవన్ డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ పేరు కడప జిల్లాకు పెట్టినట్లుగానే పెట్టాలని డిమాండ్ చేస్తూ లేఖ రాశారు. తమది డిమాండ్ కాదని.. ఒక హక్కుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నామని స్పష్టం చేశారు. దామోదరం సంజీవయ్య గురించి పవన్ కల్యాణ్ ఇటీవల ఎక్కువ పరిశోధన చేస్తున్నారు. మేధావులు, విద్యావేత్తలు, మాజీ సివిల్ సర్వీస్ అధికారులతో చర్చించారు. చివరికి దామోదరం సంజీవయ్య ఉత్సవాల్ని ఓన్ చేసుకోవడంలో మాత్రం ఫెయిలయ్యారన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాజకీయాల్లో ఇలా ఉంటే మైలేజీ రాదని జనసైనికులే అసంతృప్తి చెందే పరిస్థితి ఏర్పడింది.