మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఈ రోజు! మెగాభిమానులకు పండగ రోజు! అందరూ సంబరాల్లో మునిగారు. సంతోషంగా వున్నారు. నిన్న విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్ అభిమానుల సంతోషాల్ని రెట్టింపు చేసింది. అంతకంటే సంతోషమైన విషయం ఏంటంటే… అన్నతో అంటీముట్టనట్టుగా వుండే పవన్‌కల్యాణ్ సకుటుంబ సమేతంగా చిరంజీవి ఇంటికి వెళ్లి, అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అందులో పెద్ద విశేషం లేదు. ఎందుకంటే… ఇటీవల సందర్భం కుదిరిన ప్రతిసారీ అన్నయ్య గురించి పవన్ గొప్పగానే చెబుతున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే… సతీమణి అన్నా లెజినోవా, కుమార్తె పొలెనా, కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్‌తో కలిసి అన్న ఇంటికి పవన్ వెళ్లారు. చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ జన్మించినప్పుడు తనయుణ్ణి చేతుల్లోకి తీసుకుని పవన్ మురిపెంగా చూసుకుంటున్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. తర్వాత మళ్లీ చిన్న కొడుకుతో పవన్ ఫొటో బయటకు రావడం ఇదే. దాంతో చిరు–పవన్ కంటే చిన్నోడే హైలైట్‌గా నిలిచాడు.