షార్ట్ కట్ లో ఫ్యామస్ అయిపోదాం అనుకొన్నవాళ్లు… పవన్ గురించి కాస్త నెగిటీవ్ గా మాట్లాడితే చాలు. యాంకర్ శ్యామల కూడా అదే చేసింది. నిన్నా మొన్నటి వరకూ ఏమాత్రం పాపులారిటీ లేని శ్యామల, సడన్ గా పవన్నీ, కూటమిని తిట్టి – జనం నోళ్లలో పేరుగా మారిపోయింది. ఓ ఇంటర్వ్యూలో పిట్ట కథ చెప్పి, కథలు చెప్పడంలో తనలోని ప్రావీణ్యాన్ని చూపించింది. అయితే పవన్ ఫ్యాన్స్ ఊరుకోరుగా, శ్యామల చిట్టా మొత్తం లాగారు. యూ ట్యూబ్లో గతంలో అనామకంగా పడి ఉన్న ఓ వీడియోని బయటకు తీశారు.
పవన్ నిజాయతీ పరుడని, ప్రజలకు సేవ చేసే గుణం ఉందని, ప్రజలకు మంచి చేసే ఇలాంటి నాయకుడ్ని గెలిపించుకోవాలని, పవన్ సేవా దృక్పథం చూసి తనని అభిమానించడం మొదలెట్టానని.. ఇలా పవన్ భజన చేయడం ఆ వీడియోలో దర్శనమిచ్చింది. ఇప్పుడు పిట్ట కథ వీడియో కంటే, ఈ వీడియోనే ఎక్కువ పాపులర్ అవుతోంది. అప్పుడు పవన్ లోని నిజాయతీని మెచ్చుకొని, ఇప్పుడు ఈ పిట్ట కథలూ, కట్టు కథలూ ఎందుకు చెబుతోంది ఈ యాంకరమ్మ అని ప్రశ్నించుకొంటే – ఆమె వెనుక ఉన్న దురుద్దేశాలూ, రాజకీయ ప్రయోజనాలు ఏమిటో అర్థమవుతాయి. పవన్ ఫ్యాన్స్ ఇక్కడితో ఆగడం లేదు, శ్యామల గతంలో చేసిన చిలిపి పనులు, ఆమె తప్పొప్పుల చిట్టా మొత్తం వెదికే క్రమంలో ఉన్నారు. అసలు ఇప్పటి వరకూ శ్యామల గురించి బయటకు రాని విషయాలు, విదేశాల్లో ఆమె నడిపిన కార్యకలాపాలూ ఒకొక్కటిగా వెలుగులోకి తీసుకొస్తామంటున్నారు జనసైనికులు. గూగుల్ కూడా ఊరుకోదు కదా, ఇలా కొడితే.. అలా డేటా మొత్తం బయటకు ఇచ్చేస్తుంటుంది. శ్యామలకు సంబంధించిన డేటా.. పవన్ ఫ్యాన్స్ అలానే పోగేస్తున్నారు. శ్యామల గురించిన నిజాలు ఇంకెన్ని బయట పడతాయో..?