ఎంత కాకపోయినా ‘పవన్ మాజీ భార్య’ అనే ఇమేజ్ రేణు దేశాయ్‌కి హెల్ప్ చేస్తోంది. ఆమె ఏం మాట్లాడినా సోషల్ మీడియా బూతద్దం వేసుకొని చూస్తోంది. పవన్ ఫ్యాన్స్ కూడా గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు. రేణు కూడా ఏదోలా పవన్ ఫ్యాన్స్‌కీ, మీడియాకు టచ్‌లో ఉండాలని పరితపిస్తోంది. ఇటీవల మళ్లీ పెళ్లి అనే విషయంపై రేణు చేసిన కామెంట్లు పవన్ ఫ్యాన్స్‌కి తాకాయి. రేణు మళ్లీ పెళ్లి చేసుకొంటుందేమో అనేలా ఉన్నాయి ఆ కామెంట్లు. వదినా నువ్వు మళ్లీ పెళ్లి చేసుకోకు.. అంటూ పవన్ ఫ్యాన్స్ పర్సనల్‌గా రియాక్ట్ అయ్యారు. దీనిపై మళ్లీ సుదీర్ఘమైన వివరణ ఇచ్చుకోవాల్సివచ్చింది.
తాను ఇచ్చిన కామెంట్లు పవన్‌ని ఉద్దేశించి కాదని, అసలు తన వ్యక్తిగత జీవితం గురించి ఉద్దేశించి చెప్పినవి కాదని క్లియర్ కట్‌గా స్టేట్మెంట్ ఇచ్చింది రేణు. ఈ దేశ పౌరురాలిగానే స్పందించి స్త్రీ స్వేచ్ఛ కోసం మాట్లాడిందట. ఇది నా కోసం కాదు… మీ అమ్మల కోసం అక్కల కోసం చెల్లాయిల కోసం – అంటూ సెంటిమెంట్ ధారబోసింది రేణు. ఆడవాళ్లుచదువుకునేందుకు, పని చేసేందుకు, వారికి ఎమోషనల్ ఫ్రీడం ఇచ్చేందుకు ప్రయత్నించండి… అంటూ కోరుకొంటోంది రేణు. అయితే కొంతమంది పవన్ ఫ్యాన్స్ మాత్రం ”రేణుకు మళ్లీ పెళ్లి చేసుకోవాలని వుంది.. అందుకే ఇలాంటి కామెంట్లు పెట్టింది” అని ఇంకా మొండిగానే వాదిస్తున్నారు. అసలింతకీ అర్థం కాని విషయం ఏమిటంటే… రేణుకి విడాకులు ఇచ్చిన పవన్… మరోకర్ని నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవొచ్చు. విడాకులు తీసుకొన్న రేణు మాత్రం మరో నీడ కోరుకోకూడదా?? పవన్ ఫ్యాన్స్‌కి ఇదెక్కడి న్యాయం??