మీడియాతో డైరక్ట్ వార్ కు పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు. తన త్లలిని దూషించడం వెనుక మీడియా సంస్థలు ఉన్నాయని ఆరోపణలు చేస్తున్న పవన్ కల్యాణ్… వాటిపై న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. పవన్ కల్యాణ్ … ట్వీట్లు, పవన్ ఫ్యాన్స్ మీడియా పై దాడి చేయడం తదితర ఘటనలతో… ఒక్క సారిగా వాతావరణం అంతా వవన్ వర్సెస్ మీడియా అన్నట్లుగా మారిపోయింది. టీవీ నైన్ యజమాని శ్రీనిరాజు, ఏబీఎన్ అధినేత రాధాకృష్ణ వేర్వేరుగా క్రిమినల్ కేసులు, పరువు నష్టం కేసులు దాఖలు చేస్తున్నారు. దీంతో పవన్ కల్యాణ్ కూడా.. న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. వారు వేసిన కేసులలో వాదించడం కాకుండా.. తాను కూడా రివర్స్ కేసులేశారు. స్వయంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తన న్యాయవాదులతో కలసి వెళ్లి మరీ ఫిర్యాదు చేశారు.
శుక్రవారం ఫిల్మ్ చాంబర్ లో …ఆందోళనకు దిగిన పవన్ కల్యాణ్ కు… ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులు, ఇండస్ట్రీ పెద్దలు సర్ది చెప్పి పంపిచేశారు. అదే సమయంలో పవన్ కల్యాణ్… శ్రీరెడ్డికి సలహా ఇచ్చినట్లుగా తనకు అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ కు వెళ్లాలి కానీ.. ఆందోళనలు చేయడం.. మీడియాలో కవరేజ్ వచ్చేలా హడావుడి చేయడమేమిటన్న విమర్శలు వచ్చాయి. దాంతో పవన్ కల్యాణ్.. ఫిల్మ్ చాంబర్ నుంచి నేరుగా జనసేన కార్యాలయానికి వెళ్లి… జనసేన న్యాయవిభాగం ప్రతినిధిలతో సమావేశమయ్యారు. రెండు రోజులుగా వారితో చర్చలు జరిపారు. మీడియాపై ఏ విధంగా కేసులు వేయవచ్చో… చర్చోపచర్చలు జరిపారు. లాయర్ల సూచనలు, సలహాల మేరకు… ఆయన తన కంప్లైంట్ ను పోలీసులకు ఇచ్చారు.
పవన్ కల్యాణ్ … ట్వీట్లు, పవన్ ఫ్యాన్స్ మీడియా పై దాడి చేయడం తదితర ఘటనలతో… ఒక్క సారిగా వాతావరణం అంతా వవన్ వర్సెస్ మీడియా అన్నట్లుగా మారిపోయింది. టీవీ నైన్ యజమాని శ్రీనిరాజు ఇప్పటికే లీగల్ నోటీసులకు పవన్ కల్యాణ్ కు పంపారు. వాటిని పవన్ స్వయంగా ట్విట్టర్ లో పెట్టారు. శ్రీనిరాజు, వేమూరి రాధాకృష్ణ వేసిన కేసులలో వాదించడం కాకుండా.. తాను కూడా రివర్స్ కేసులేయాని నిర్ణయించుకున్నారు. అయితే మీడియాపై కేసులు పెట్టాలన్న పవన్ కల్యాణ్ నిర్ణయంపై విస్మయం వ్యక్తమవుతోంది. వార్తలను చూపించడమే తప్పన్నట్లుగా పవన్ కల్యాణ్… పోలీసులకు ఫిర్యాదు చేయడంపై మీడియా వర్గాలు కూడా.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. మీడియాలో ఏమైనా తప్పులు వస్తే.. ప్రెస్ కౌన్సిల్ లాంటి సంస్థలకు ఫిర్యాదులు చేయాలి పోలీసుల వద్దకు వెళ్లడమేమిటన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీడియా ఎంతగా తనపై దుష్ప్రచారం చేస్తున్నా..తనెందుకు ఇంకా సహనంతో ఉండాలని ప్రశ్నిస్తున్నారు.