ప్రజాపోరాటయాత్రలో భాగంగా సోమవారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ మీడియా పై ధ్వజమెత్తారు జనసేనాని పవన్ కళ్యాణ్. మైనింగ్ కంపెనీ ‘ఆండ్రూ’ అక్రమాలపై ధ్వజమెత్తుతూ పవన్ కళ్యాణ్ లఫూట్ అని తిట్టడం, దాని మీద మన తెలుగు చానల్లో మెట్లమీద డిబేట్ పెట్టడం జరిగింది. దీనిపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ మీడియా పై ధ్వజమెత్తారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..
‘వేల కోట్లు దోచుకుంటున్న మైనింగ్ కంపెనీ ‘ఆండ్రూ’ యజమానిని లఫూట్ అని నేను తిడితే డిబేట్లు పెట్టారు. పవన్ కళ్యాణ్ ఇలా సపోర్ట్ అని తిట్టచ్చా తిట్టచ్చా, ఒక నాయకుడు ఇలాంటి మాటలతో తిట్టొచ్చా తిట్టొచ్చా.. అంటూ తెగ డిబేట్ లు పెట్టారు. బాలకృష్ణ.. మోదీ తల్లిని తూలనాడితే డిబేట్లు పెట్టరు. అప్పుడు ఎందుకు మీరు డిబేట్ లు పెట్టలేదు. దెందులూరు ఎమ్మెల్యే మాదిగలను కులంపేరుతో దూషిస్తూ మాదిగ కొడకా అని తి డితే అప్పుడు డిబేట్ పెట్టరు. వనజాక్షిని చెప్పుతో కొడితే డిబేట్ పెట్టరు. అడ్డగోలుగా రిజర్వ్ ఫారెస్టులో బాక్సైట్ దోచే వాడినిి లఫూట్ అని తిడితే దానికి మాత్రం డిబేట్లు పెడతారా? నా వద్ద వేల కోట్లు లేవు. చానళ్లు లేవు.. నా చానళ్లు, పత్రికలు, ఫేస్‌బుక్‌లు, రేడియోలు.. మీరే..’
త్రివిక్రమ్ జల్సా సినిమాలో ఒక డైలాగ్ రాశారు..” చెప్పిన దాంట్లో అవసరమైన దాన్ని వదిలేసి అనవసరమైన దాన్ని పట్టుకొని వేలాడే వాన్నే గూట్లే అంటారు రా గూట్లే” అని. ప్రస్తుతం తెలుగు మీడియా పరిస్థితి ఇలాగే ఉంది. నిజంగా తెలుగు మీడియా కి బాధ్యత ఉంటే, ఆండ్రూ అనే మైనింగ్ కంపెనీలో అక్రమాలు జరుగుతున్నాయి అన్న ఆరోపణ ఎంతవరకు నిజం అని డిబేట్ పెట్టి ఉండేది. ఆరోపణ నిజమా అబద్దమా అన్నది వేరే విషయం. కనీసం ఆ సమస్యపై ఆ ఆరోపణపై డిబేట్ ఫోకస్ చేయకుండా, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మొత్తం లోంచి ఒక పదాన్ని తీసుకొని దాని మీద డిబేట్ లు పెట్టాయి మన తెలుగు చానల్స్. సోషల్ మీడియాలో కూడా ఈ ఛానల్ ల తీరు పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
-జురాన్