కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రైవేటు సైన్యం.. జనసేన కార్యకర్తలపై జరిపిన దాడులు కలకలం రేపుతున్నాయి. పోలీసుల చేతుల్లోని లాఠీలను లాక్కొని.. బురదగుంటల్లోకి తోసేసి మరీ జనసేన కార్యకర్తల్ని కొట్టారు.. ద్వారంపూడి అనుచరులు. అయినప్పటికీ.. కేసులు జనసేన కార్యకర్తలపైనే నమోదయ్యాయి. ఈ విషయం తెలిసి … జనసేనాని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్న ద్వారంపూడిపై చర్య తీసుకోలని డిమాండ్ చేశారు. దాడులు చేస్తే.. వెనుకజుగు వేయబోమని.. అధర్మాన్ని ఖండించడమే జనసేన విధానమని పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన కార్యకర్తలకు, నాయకులకు అన్యాయం చేసి ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తే ఢిల్లీ పర్యటన నుంచి నేరుగా కాకినాడకు వస్తానని ప్రకటించారు.
కాకినాడులో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. పవన్ కల్యాణ్‌పై ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలపై… కాకినాడలో కలకలం రేపింది. అక్కడ జనసేన పార్టీ కాస్త బలంగా ఉంది. పవన్ పై ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలు.. ఓ ప్రముఖ సామాజికవర్గానికి మొత్తానికి అన్వయిస్తూ.. వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో.. అధిక సంఖ్యలో.. ఉన్న ఆ సామాజికవర్గం ప్రజలు.. ఎమ్మెల్యే తీరుపై మండి పడుతున్నారు. తమ సామాజికవర్గం ఆడవాళ్లను.. అంత దారుణంగా తిట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు కూడా.. ద్వారంపూడి ప్రైవేటు సైన్యానికి మద్దతు పలికి.. దాడులను చూస్తూ ఊరుకోవడం.. మరింత ఆగ్రహానికి కారణం అవుతోంది.
పవన్ కల్యాణ్ ఢిల్లీ నుంచి నేరుగా.. కాకినాడ వస్తే మాత్రం.. జనసైనికులకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. పవన్ కల్యాణ్ తమ వెంట ఉన్నారన్న ధైర్యం వారికి వస్తుంది. ఎందుకంటే.. కాకినాడలో జరిగింది.. సామాన్యమైన దాడి కాదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని.. ప్రైవేటు సైన్యం చేసిన దాడి. బీహార్‌లో మాత్రమే.. అలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. పోలీసులు చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏపీలో కూడా.. సాక్షాత్కారమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్ని ఇలాగే వదిలేస్తే.. అవి అంతకంతకూ పెరిగే అవకాశం ఉంది. అందుకే పవన్ కల్యాణ్.. కాకినాడకు వచ్చి… పోరాటం చేయాలని.. జనసైనికులు కూడా కోరుతున్నారు.