సౌత్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఎప్పుడు ఫిట్ గా ఉంటాడు అది ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా. ఒక హీరోగా కాకుండా ప్రజల తరపున ప్రశ్నిస్తా అంటూ జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ మీటింగ్ లో కూడా మంచి ఫిట్ నెస్ తో కనిపిస్తారు. అయితే పవన్ ఫిట్ నెస్ వెనుక ఉన్న రహస్యాలేంటి అంటే ఒక్క పూట భోజనమే అంటున్నారు. ఒక పూట భోజనం మిగతా టైంలో మంచి రా ఫుడ్ తిని మంచి డైట్ పాటించడమే తన ఫిట్ నెస్ కి కారణమట. అంతేకాదు చిన్నప్పటినుండి కరాటే అంటే ఇష్టం కనుక ఇప్పటికి ఫ్రీ టైంలో కరాటే కూడా చేస్తారట పవర్ స్టార్.
ఒక్కపూట పుష్టిగా తిని ఇక మిగతా వేళల్లో పళ్లు పలహారాలు తింటే చాలు బాడీ అదే ఫిట్ గా ఉంటుంది అంటూ తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు పవన్ కళ్యాణ్. సో తెలిసిందిగా పవర్ స్టార్ ఫిట్ నెస్ సూత్రం ఇకనుండి మనం కూడా పవన్ లా ఫిట్ గా ఉండటానికి ట్రై చేద్దాం అలా అని కడుపు మాడ్చుకుని కాదు.. ఒకేసారి కాకుండా మెల్ల మెల్లగా డైట్ కంట్రోల్ చేసుకుంటే మంచి ఫిట్ నెస్ కలిగి ఉండే అవకాశం ఉంది.