‘‘ఆర్ఆర్ఆర్’ చిత్రం అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటింది. ప్రతిష్ఠాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌లో విదేశీ చిత్రాలతో పోటీ పడుతూ ఏకంగా నాలుగు పురస్కారాల్ని సాధించింది. ఉత్తమ అంతర్జాతీయ చిత్రంతో పాటు ఉత్తమ యాక్షన్ చిత్రం, ఉత్తమ స్టంట్స్, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు) విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది . ఈ సందర్భంగా చిత్ర బృందంపై అభినందనల జల్లు కురుస్తోంది. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆర్ఆర్ఆర్ టీంని అభినందిస్తూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
అయితే పవన్ కళ్యాణ్ అభినందనలో ఎన్టీఆర్ పేరు ప్రస్థావించకపోవడం ఇప్పుడు చర్చనీయంశమైయింది. ‘ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో ‘ఆర్ఆర్ఆర్’ పలు పురస్కారాలు దక్కించుకోవడం ఆనందదాయకం. ఈ వేదికపై ‘బెస్ట్ వాయిస్, మోషన్ కాప్చర్ పెర్ఫార్మెన్స్’ను రామ్‌చరణ్ ద్వారా ప్రకటింపచేయడం, స్పాట్ లైట్ అవార్డు స్వీకరించడం సంతోషాన్ని కలిగించింది. రామ్‌చరణ్‌కు, దర్శకుడు రాజమౌళికి, చిత్రబృందానికి హృదయపూర్వక అభినందనలు. చరణ్ మరిన్ని మంచి చిత్రాలు చేసి అందరి మన్ననలు పొంది ఘన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు పవన్ కల్యాణ్.
ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్ ఎన్టీఆర్ ల సినిమా. ఈ సినిమాకి వచ్చిన విజయాలు అవార్డులు ఇద్దరికీ చెందుతాయి. కొన్ని కారణాల వలన ఎన్టీఆర్ అవార్డ్ ఈవెంట్ కి వెళ్ళలేకపోయారు. అయితే అభినందనల విషయంలో ప్రేక్షకులు, అభిమానులు రామ్ చరణ్. ఎన్టీఆర్ ఇద్దరినీ ప్రసంశిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ లో ఎన్టీఆర్ పేరు రాకపోవడం చర్చకు దారితీసింది.