స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రజలందరికీ ఈరోజు ట్వీటర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసారు. ఆయన ట్వీట్ చేసినప్పుడు రాజధాని భూసేకరణ విషయం తప్పకుండా ప్రస్తావిస్తారని అందరూ ఎదురుచూస్తారు. కానీ ఆయన ప్రముఖ కవి శేషేంద్ర శర్మ కవిత- “నేనింత ఒక పిడికెడు మాట్టే కావచ్చు కానీ కలమేట్టితే ఒక దేశపు జెండాకునంత పొగరుంది. సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు, తుఫాను గొంతు చిత్తం అనడం ఎరుగదు,పర్వతం ఎవ్వడికీ ఒంగి సలాం చెయ్యదు,” అని ట్వీట్ చేసారు. బహుశః భారతీయులు అందరూ ఆవిధంగా ఆత్మగౌరవం, పోరాట పఠిమ కలిగి ఉండాలని ఆయన సూచిస్తున్నట్లుంది.