డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రభుత్వం విజయవాడలో ఇచ్చిన క్యాంప్ ఆఫీసును మళ్లీ ప్రభుత్వానికి ఇచ్చేశారు. ఆయన అక్కడి నుంచే అధికారిక సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీస్ అక్కడ ఉండటం వల్ల వచ్చే జనంతో అనేక సమస్యలు వస్తున్నాయి. భవనానికి వెనుకాలే కోర్టుల సముదాయం ఉంది. అక్కడకు వెళ్లి వచ్చే వారికి పవన్ కల్యాణ్ రాకపోకలతో సమస్యలు వస్తున్నాయి. పవన్ వచ్చి వెళ్లేటప్పుడు ట్రాఫిక్ నిలిపేయడం, అధికారుల రాకపోకలతో కూడా కోర్టులకు వెళ్లే వచ్చే వాళ్లకు ఇబ్బందులు తప్పడం లేదన్న ఫీడ్ బ్యాక్ పవన్ కల్యాణ్‌కు వచ్చింది.
దాంతో పవన్ కల్యాణ్ మంగళగిరిలోని తన నివాసాన్ని క౧ద్ది కాలం క్యాంప్ ఆఫీసుగా మార్చుకోవాలని నిర్ణయించారు. గత కొద్ది రోజులుగా పార్టీ కార్యాలయంలో బస చేసే బిల్డింగ్‌లోనే సమీక్షలు నిర్వహిస్తున్నారు. దాన్నే క్యాంపు కార్యాలయంగా మార్చుకోవాలని చూస్తున్నారు. అందుకే అధికారికంగా తనకు కేటాయించిన భవనాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీసు నిర్మాణం చురుగ్గా ాసగుతోంది.
ఐదు అంతస్తుల పార్టీ ఆఫీసులో మొదటి రెండు అంతస్తులు మరింత వేగంగా పూర్తి చేసి అందులోకి త్వరలో వెళ్లిపోవాలని చూస్తున్నారు. ఈ లోపు తాత్కాలిక క్యాంపు కార్యాలయంగా తను బస చేసే బిల్డింగ్‌ను వాడుకుంటున్నారు. క్యాంప్ ఆఫీసే అయినా జగన్ చేసినట్లుగా చేయకుండా ..ఒక్క రూపాయి కూడా ప్రజాధనాన్ని కేటాయింప చేసుకోకండా.. తన క్యాంప్ ఆఫీస్ ఏర్పాట్లు తానే చేసుకోవాలని పవన్ నిర్ణయించుకున్నారు. తనదిప్రైవేటు భవనం కావడంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జగన్ పార్టీ కార్యాలయంగా మార్చిన క్యాంప్ ఆఫీసులో ప్రతి వస్తువు ప్రజాధనంతో కొన్నదే.