యార్లగడ్డ సుప్రియ.. గుర్తుందా ? అక్కినేని వారి మనవరాలు. పవన్ కళ్యాణ్ మొదటి సినిమా హీరోయిన్. పవన్ కళ్యాణ్- సుప్రియ ఒకేసారి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మెగా ఫ్యామిలీ నుండి పవన్ కళ్యాణ్ .. అక్కినేని మనవరాలిగా యార్లగడ్డ సుప్రియ ఇండస్ట్రీకి వచ్చారు. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమా ”అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి’. అయితే ఇక్కడ అబ్బాయి మాత్రం పవర్ స్టార్ అయ్యాడు. అమ్మాయి మాత్రం అక్కడే వుండిపోయింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ సినిమా చేయలేదు సుప్రియ. అవకాశాలు రాక కాదు. పెద్దగా ఆసక్తిలేక. బిజినెస్ , స్టూడియో మేనేజ్ మెంట్ లో బిజీ అయిపోయింది సుప్రియ.
అయితే చాన్నాళ్ళ తర్వాత ఆమె మళ్ళీ మేకప్ వేసుకోవడానికి ఓకే చెప్పిందట. అడవి శేష్ గూఢచారి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సుప్రియను పోలీస్ ఆఫీసర్ గా చూపించబోతున్నాడని టాక్. రీఎంట్రీ ఇవ్వాలని సుప్రియకు ఆసక్తి లేదు. ఐతే అడవి శేష్ తో వున్న స్నేహంతో ఆమె ఈ పాత్ర చేయడానికి అంగీకరించిందట. మొత్తంమ్మీద పవన్ హీరోయిన్ మళ్ళీ తెరపై మెరుస్తుంది.