జనసేన అధినేత పవన్ కల్యాణ్ సున్నిత మనస్కుడు. ఎవరైనా కష్టాల్లో ఉంటే సొంత డబ్బుతో వెంటనే ఆదుకునేందుకు వెనుకాడరు. ఆయన మనసు ఎంత మెత్తనో మరో ఘటన వెలుగు చూసింది.
పవన్ కల్యాణ్ ఇటీవల మన్యంలో గిరిజన గ్రామాల్లో పర్యటించారు. పెదపాడు అనే గ్రామంలోకి వెళ్లినప్పుడు గ్రామంలో మహిళలు అత్యధిక మంది చెప్పులు లేకుండా తిరుగుతున్నట్లుగా గుర్తించారు. కొండ ప్రాంతమైన ఆ గ్రామంలో ..రాళ్లు, ముల్లులు ఉంటాయి. అయినా పేదరికం కారణం గా వారు చెప్పులు కొనుక్కోలేకపోతున్నారని గుర్తించారు. వెంటనే గ్రామంలో మహిళలు మొత్తం ఎంత మంది ఉన్నారు..వారి కాళ్ల సైజులు ఎంతో సర్వే చేయించి అందరికీ చెప్పులు పంపించారు. పెదపాడు సర్పంచి అందరికీ ఇంటింటికి వెళ్లి పవన్ పంపించారని చెప్పి ఇచ్చారు. ఆ గిరిజన మహిళలు మురిసిపోయారు.
ప్రజల మనసుల్ని హత్తుకునేలా సాయం చేయడంలో పవన్ కల్యాణ్ ముందు ఉంటారు. తమ కష్టాన్ని ఆయన గుర్తించారని ఆ మహిళలు కూడా సంతోషపడుతున్నారు. నిజానికి పవన్ కల్యాణ్ ఆ గ్రామానికి వెళ్లిన సమయంలో తన కుమారుడికి అగ్నిప్రమాదం గురించి తెలిసింది. అయినా ఆ టెన్షన్ లోనూ వారి కష్టాన్ని మర్చిపోలేదు.