పవన్ కల్యాణ్‌కి నితిన్ వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. తన సినిమాలో పవన్‌కి సంబంధించిన రిఫరెన్సులు కనిపిస్తూనే ఉంటాయి. బిట్ సాంగ్స్ కూడా వాడేస్తుంటాడు. ఇప్పుడూ అదే రిపీట్ చేయబోతున్నాడు. నితిన్ – వక్కంతం వంశీ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నితిన్ క్యారెక్టర్ విభిన్నంగా ఉండబోతోంది. తాను ఓ జూనియర్ ఆర్టిస్టుగా కనిపించబోతున్నాడు. ఓ సందర్భంలో పవన్ సినిమాలో.. జూనియర్ గా నటించే అవకాశం వస్తుందని, అదే సమయంలో పవన్ కల్యాణ్‌ని గానీ, తన రిఫెన్స్ని గానీ చూపించే అవకాశం ఉందని సమాచారం. తెరపై పవన్ కనిపిస్తాడో లేదో కానీ, పవన్ ప్రస్తావన మాత్రం తప్పకుండా ఈ సీన్ లో వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పవన్‌ని చిన్న కామియో కోసం తీసుకురావాలని నితిన్ అనుకొన్నా.. అదేమంత కష్టం కాదు. ఎందుకంటే.. పవన్ అంటే నితిన్‌కి ఎంతిష్టమో.. నితిన్ అన్నా పవన్‌కి అంతే అభిమానం. నితిన్ అడిగితే.. పవన్ కాదనడు. పైగా పవన్ షూటింగ్ చేస్తున్న సెట్ కి వెళ్లి… ఆ సీన్‌ని షూట్ చేసుకొచ్చే సౌలభ్యం కూడా ఉంది. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం కోసం `జూనియర్`, `సైతాన్` అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. టైటిల్ ని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు.