హైదరాబాద్: ముద్రగడ ఆమరణ నిరాహారదీక్షపై ప్రభుత్వానికి, కాపులకు మధ్య ఏర్పడిన సంక్షోభ పరిస్థితిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్యాహ్నం ట్విట్టర్లో స్పందించారు. రిజర్వేషన్ విషయంపై ప్రభుత్వం కాపు నాయకులతో నేరుగా చర్చలు జరపాలని సూచించారు. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామన్నది తెలుగుదేశం ఎన్నికల హామీ అని గుర్తు చేశారు. కాపుల అంశం చేయిదాటిపోయి విషమ సమస్యగా మారకముందే దీనికి పరిష్కారాన్ని కనుగొనాలని, నిష్పక్షపాతంగా వ్యవహరించే మేధావుల బృందాన్నొకదాన్ని ఏర్పాటు చేసి ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే బాధ్యతను అప్పజెప్పాలని హెచ్చరిస్తూ పవన్ ట్వీట్ చేశారు.
— Pawan Kalyan (@PawanKalyan) February 7, 2016