పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలతో బిజీ కానున్నారు. ఆయన చేయబోయే సినిమాల ప్రణాళిక సిద్దమైయింది. ఇప్పటికే ఒక సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. బాలీవుడ్ లో విమర్శల ప్రసంశల అందుకున్న ‘పింక్’ సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు పవన్. దీనితో పాటు దర్శకుడు క్రిష్ తో సినిమా ఏర్పాట్లు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే కధని ఓకే చేశారు పవన్. ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మిస్తారు. ఇదో జానపద కధ. లేటెస్ట్ ఆప్దేట్ ఏమిటంటే.. ఈ సినిమా బడ్జెట్ దాదాపు వందకోట్లు వుంటుదని తెలిసింది.
కధ ప్రకారం.. సినిమాకి చాలా సెట్ వర్క్ అవసరమౌతుంది. బాహుబలి మాహిష్మతి సామ్రాజ్యంలా ఓ రాజ్యాన్ని నిర్మించాల్సి వుంటుదట. పెద్దపెద్ద రాజదర్బార్లు, కోటలు.. గుర్రపు స్వారీ లు, కత్తి యుద్దాలు ఇందులో కనిపించబోతున్నాయి. దానితో పాటు సిజీ వర్క్ కి కూడా ప్రాధాన్యత కూడా వుందట. దానితో పాటు ఈ సినిమాకి ప్యాన్ ఇండియా ఇమేజ్ ని తీసుకువచ్చేలా ప్లాన్ జరుగుతుంది. హిందీ మినహా మిగిలిన భాషల్లోనూ విడుదల చేసే ఆలోచన వుంది
వందకోట్లు అంటే పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యధిక బడ్జెట్ సినిమా అవుతుంది. అటు క్రిష్ కి కూడా. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం క్రిష్ విషయంలో చాలా నమ్మకంగా వున్నారు. క్రిష్ కి అటు బాలీవుడ్ లో కూడా మంచి పేరుంది. ముఫ్ఫై కోట్ల బడ్జెట్ తో ‘గద్దర్ ఈజ్ బ్యాక్’ సినిమా తీసి వందకోట్లు వసుళ్ళూ రాబట్టిన రికార్డ్ క్రిష్ వుంది. అలాగే మణికర్ణిక లాంటి హిస్టారికల్ సినిమా తీసిన అనుభవం క్రిష్ సొంతం. అందుకే అటు నిర్మాత ఏయం రత్నం కూడా ఖర్చు విషయంలో వెనకడుగువేయడం లేదు.