పవన్ కల్యాణ్ – క్రిష్ కాంబినేషన్లో ఓ సినిమా ఈరోజే కొబ్బరి కాయ కొట్టుకుంది. పిబ్రవరి 4 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. మొగలాయిల పరిపాలనా కాలం నాటి కథ ఇది. ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా సెట్స్ అవసరమయ్యాయి. ముఖ్యంగా తాజ్ మహల్, చార్మినార్ సెట్లు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నాయి. అవి రెండూ సెట్స్‌గా తీర్చిదిద్దబోతున్నారు. కేవలం సెట్స్ కోసమే 20 కోట్ల వరకూ బడ్జెట్ కానున్నదని సమాచారం. అల్యూమినియం ఫ్యాక్టరీలోనూ కొన్ని సెట్స్‌ని రూపొందిస్తున్నారు. తొలి షెడ్యూల్ అక్కడే జరగబోతోంది. అప్పటి మహమ్మదీయుల కట్టడాలన్నీ దాదాపుగా తెరపై చూపించబోతున్నారని తెలుస్తోంది. ఈసినిమాలో పవన్ కల్యాణ్ ఓ దొంగగా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇద్దరు కథానాయికలకు చోటుంది. అందులో ఒకరిని బాలీవుడ్ నుంచి దిగుమతి చేస్తారు. ప్రతినాయకుడి పాత్ర కోసం కూడా బాలీవుడ్ నటుడినే ఎంచుకునే అవకాశం ఉంది.