డేట్లు ఇచ్చే ముందు కాస్త ఆలోచిస్తారు కానీ ఒకసారి డేట్లు ఇచ్చిన తర్వాత చాలా వేగంగా పని చేస్తారు పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్ కూడా ఇలానే చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేశారు. ఇప్పుడు ‘వినోదాయ సీతమ్ ’ రీమేక్ కూడా జెట్ స్పీడ్ లో జరుగుతోంది.
ఈ సినిమా కోసం ఇరవై రెండు రోజులు ఇచ్చారు పవన్. ఇప్పుడు కేవలం వారం రోజులే మిగిలుంది. ఈ నెల చివరికి పవన్ కళ్యాణ్ పోర్షన్ పూర్తయిపోతుంది. తర్వాత హరీష్ శంకర్, సుజిత్ సినిమాలకు షిఫ్ట్ అవుతారు.
‘వినోదాయ సీతమ్ ’ విషయానికి వస్తే సముద్రఖనితెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ కూడా కీలక పాత్రలో కనిపిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ రీమేక్‌లో పవన్ కల్యాణ్ మోడ్రన్ దేవుడిగా కనిపించబోతున్నారు. ఇదివరకు పవన్ గోపాల గోపాలలో కూడా దేవుడిగా కనిపించారు.