పవన్ కల్యాణ్ తన తొలి ప్రేమ సినిమాకు వచ్చిన రెమ్యూనరేషన్ లో సగం డబ్బులు పెట్టి పుస్తకాలు కొనేశానని చెప్పారు. ఇప్పుడు మరోసారి అదేపని చేశారు. మంత్రిగా ఓ నెల పాటు తనకు వచ్చే జీతభత్యాలన్నింటితో కలిసి పుస్తకాలు కొనేశారు. దాదాపుగా ఐదు లక్షల రూపాయల విలువైన పుస్తకాలను ఆయన కొనుగోలు చేశారు. విజయవాడ పుస్తక. మహోత్సవం ముగింపు రోజున ఉదయం ఆయన వెళ్లారు. సాధారణంగా బుక్ ఎగ్జిబిషన్ తెరిచే సమయం కన్నా పవన్ కల్యాణ్ వస్తున్నారన్న కారణంగా ముందే తెరిచారు.
బుక్ సెల్లర్స్ ను పవన్ కల్యాణ్ నిరాశపర్చలేదు. ఆ బుక్స్ అన్నీ పవన్ చదవలేకపోవచ్చు కానీ.. పిఠాపురంలో తాను ఏర్పాటు చేయదల్చుకున్న లైబ్రరీకి పంపాలని నిర్ణయించుకున్నారు. ఓ పుస్తకాన్ని మాత్రం ఎక్కువ కాపీలు కొన్నారు. ఎందుకంటే వాటిని తనను కలసిన వారికి బహుమతిగా ఇస్తామని చెప్పారు. పవన్ కల్యాణ్ కు బుక్ రీడింగ్ మీద ఎక్కువ ఆసక్తి. క్లాస్ పుస్తకాల కన్నా ఆయన పుస్తకాల్లో పెద్దల జీవితాలను చదవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పటికీ ఆయనకు బుక్స్ అంటే ఎంతో మక్కువ చూపిస్తారు.
పుస్తక పఠనం వల్లనే తనకు ఎంతో మెచ్యూరిటీ వచ్చిందని పవన్ కల్యాణ్ చెబుతారు.పవన్ కల్యాణ్ ఆఫీసు అయినా..జనసేన పార్టీ ఆఫీసు అయినా.. ఎక్కడ అయినా పుస్తకాలకు ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తూ ఉంటుంది. ప్రజల జీవితాలు మార్చే స్ఫూర్తివంతమైన నేతల గురించి చదివేందుకు.. విషయపరిజ్ఞానం పెంచుకునేందుకు అవసరమైన పుస్తకాలకు పవన్ ప్రాధాన్యం ఇస్తారు.