ఓజీ అంటే తనకు మోదీ అని వినిపించేదని పవన్ కల్యాణ్ పల్లె పండుగ ప్రారంభ కార్యక్రమంలో చెప్పారు. ఆ వెంటనే ఆయన తన శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి సిద్ధం చేసిన ఫ్లెక్సీలు, ప్రచార కార్యక్రమాల్లో ఎక్కడా మోదీ ఫోటో లేకపోవడం గుర్తించారు. వెంటనే ఆదేశాలు జారీ చేశారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని మోదీఫోటోను మిస్ కావొద్దని అధికారులకు స్పష్టం చేశారు. పల్లె పండుగ కార్యక్రమానికి అవసరమై నిధులన్నీ కేంద్ర నిధులే.
ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి హామీ నిధులు రూ. నాలుగున్నర వేలకోట్లతో పల్లె పండగలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మోదీకి తగిన ప్రాధాన్యత దక్కలేదని పవన్ ఫీలయ్యారు. బీజేపీ నేతలు ఇలాంటివి అడ్వాంటేజ్ గా తీసుకుంటారన్న ఉద్దేశమో లేకపోతే నిజంగానే మోదీ ఫోటో ఉండాలని అనుకున్నారో కానీ వెంటనే ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి పంచాయతీరాజ్ శాఖలో కనిపించే ప్రతి పోస్టర్ లో మోదీ ఉంటారని అనుకోవచ్చు.
వైసీపీకి బీజేపీ ఎంతగా సహకరించినా మోడీ ఫోటో ఉండేది కాదు. ఏకంగా కేంద్ర పథకాన్ని కలిపేసి తామే ఇస్తున్నట్లుగా ప్రకటనలు ఇచ్చుకునే రైతు భరోసా పథకంలోనూ మోదీ ఫోటో ఉండేది కాదు. కేంద్రం నుంచి స్ట్రాంగ్ వార్నింగ్ రావడంతో పీఎం కిసాన్ అనే పేరు యాడ్ చేసి చిన్నగా పెట్టడం ప్రారంభించారు. చాలా సార్లు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రులు.. మోడీ ఫోటో లేకపోవడంపై ఫైరయ్యేవారు. ఈ సారి పవన్ ఇలాంటి చిన్న విషయాలనూ వదిలి పెట్టకుండా గౌరవాన్ని ఇస్తున్నారనుకోవచ్చు.