కర్నూలు జిల్లా ఆలూరు మండలం ,హత్తి బెళగల్ వద్ద జరిగిన క్వారీ పేలుడు ఘటనలో 11మంది మృతిచెందగా, మరికొందరు గాయపడటం, గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించడటం తెలిసిందే. కర్నూలు జిల్లాలో హత్తి బెళగల్ లో జరిగిన క్వారీ పేలుడు సంఘటనా స్థలాన్ని పవన్ కళ్యాణ్ ఈరోజు దర్శించారు. కర్నూలు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తూ ఉండడంతో భారీగా జనం చేరుకున్నారు.
క్వారీ ఘటనా స్థలాన్ని పరిశీలించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పేలుళ్ల బాధితులను పరామర్శించారు. అలాగే పేలుళ్ల కారణంగా బీటలు వారిన ఇళ్ళ ను కూడా పరిశీలించారు. క్వారీలో జరుగుతున్న బ్లాస్టింగ్‌కు ఇళ్లు కంపిస్తున్నాయని, పగుళ్లు ఇస్తున్నాయని, శబ్దాలకు భయాందోళనకు గురవుతున్నామని గతంలో కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, పోలీసులకు ఆ గ్రామస్థులు గతంలో విన్నవించుకున్నారు. గతంలో ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రభుత్వం దీనికి పూర్తిగా బాధ్యత వహించాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇంతలా ప్రమాదాలు జరుగుతుంటే గనుల శాఖామంత్రి నిద్రపోతున్నారా అంటూ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్.
ఇక ఇలాంటి క్వారీలను మూసి వేయకపోతే జనసేన కార్యకర్తలు వీటిని మూసివేస్తారని హెచ్చరించారు పవన్ కళ్యాణ్.